'2.0' గ్రాఫిక్స్ వ‌ర్క్ కోసం...

  • IndiaGlitz, [Tuesday,October 31 2017]

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న విజువ‌ల్ సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ '2.0'. బాలీవుడ్ స్టార్ అక్ష‌య్ కుమార్ విల‌న్‌గా న‌టిస్తుంటే, ఎమీజాక్స‌న్ రోబో పాత్ర‌లో క‌న‌ప‌డ‌నుంది. ఈ సినిమాను వ‌చ్చే ఏడాది జ‌న‌వరిలో విడుద‌ల చేస్తామ‌ని యూనిట్ ప్ర‌క‌టించింది. కానీ తాజాగా సినిమా ఏప్రిల్ 13న వచ్చే అవ‌కాశాలే ఎక్కువ‌గా క‌న‌ప‌డుతున్నాయని ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం.

శ్రీనివాస్ మోహ‌న్ విఎఫ్ఎక్స్ ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నాడు. ఈ సినిమా గ్రాఫిక్స్‌ను వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని శంక‌ర్ భావిస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పుడు 11 విఎఫ్ఎక్స్ స్టూడియోస్ 2.0 గ్రాఫిక్స్‌పై వ‌ర్క్ చేస్తున్నాయ‌ట‌.