ప్రాంతీయ భాషల్లో సోనీ లివ్ 'మాస్టర్ చెఫ్ ఇండియా'... త్వరలో తమిళ్, తెలుగులో స్ట్రీమింగ్
Send us your feedback to audioarticles@vaarta.com
ఓటీటీలు రంగ ప్రవేశం చేసిన తర్వాత రియాలిటీ షోలకు ఆదరణ పెరిగింది. గతంలోనే ఈ కార్యక్రమాలు వున్నప్పటికీ వాటికి సెలెక్డ్‌డ్ ఆడియన్స్ వుండేవారు. అయితే ఓటీటీ యాప్‌లు ఇటువంటి ప్రోగ్రామ్‌లను ప్రేక్షకులకు చేరువ చేశాయి. అలాంటి కార్యక్రమాల్లో ఒకటి మాస్టర్ చెఫ్ ఇండియా ఒకటి. సోనీ లివ్‌లో హిందీ మాధ్యమంలో సక్సెస్ అయిన ఈ షో ఇప్పుడు ప్రాంతీయ భాషల్లోనూ రంగ ప్రవేశం చేయనుంది. మాస్టర్ చెఫ్ ఇండియా తమిళ్, మాస్టర్ చెఫ్ ఇండియా అనే పేర్లతో ఈ షో తమిళ, తెలుగు భాషల్లోకి అడుగుపెట్టనుంది. తమిళ్ షోకు .. కౌశిక్ శంకర్, శ్రీయా అడ్కా, రాకేష్ రఘునాథన్‌లు జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. తెలుగు విషయానికి వస్తే.. సంజయ్ తుమ్మా, నిఖిత ఉమేజ్, చెఫ్ చలపతిరావులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించనున్నారు.
దక్షిణాదిలో విభిన్న వంటకాలు , రుచులు :
దక్షిణ భారతదేశంలోని వున్న ఐదు రాష్ట్రాల్లో వేరు వేరు భాషలు, వేరు ఆహారపు అలవాట్లు , ఆచారాలు, సాంప్రదాయాలు వున్న సంగతి తెలిసిందే. వీటిని ప్రతిబింబించేలా మాస్టర్ చెఫ్ షోను డిజైన్ చేశారు. ఈ కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా ఆడిషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సోనీ లివ్ కంటెంట్ హెడ్.. సౌగాట ముఖర్జీ మాట్లాడుతూ.. భారతదేశం భిన్న సంస్కృతులకు నిలయమన్నారు. మనదేశంలోని ప్రాంతీయ భాషల్లో మాస్టర్ చెఫ్ ఇండియా కార్యక్రమాన్ని తీసుకొస్తున్నట్లు చెప్పారు. దీనిలో భాగంగా తమిళ, తెలుగు భాషల్లో త్వరలో షో రాబోతోందని.. ఈ కార్యక్రమం వల్ల దక్షిణాదికి చెందిన మరిన్ని రుచులను భారతదేశానికి చూపించే అవకాశం కలుగుతుందని ముఖర్జీ అభిప్రాయపడ్డారు.
ఓటీటీలో దూసుకెళ్తున్న సోనీ లివ్ :
ఇక సోనీ లివ్ విషయానికి వస్తే.. సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా (ఎస్ పీ ఎన్ ఐ)లో ఇది భాగం. అన్ని రకాల డివైస్‌లో ఈ సోనీ లీవ్ అందుబాటులో ఉంది. ఎస్‌పీఎన్‌ఐలోని 27 ఏళ్ల కంటెంట్‌ను సోనీ లీవ్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. 40 వేల గంటల ప్రోగ్రాంలు ఉన్నాయి. హాలీవుడ్ షోలు, టీవీ షోలు, లైవ్ టీవీలు ఇలా ఎన్నెన్నో సోనీ లీవ్ సబ్‌స్క్రైబర్లకు అందుబాటులోనే ఉన్నాయి. వంద మిలియన్ల మంది యూజర్లు సోనీ లీవ్‌ను డౌన్ లోడ్ చేసుకున్నారు. హిందీ, మరాఠీ, తమిళ్, మలయాళం, తెలుగు ఇలా ఎన్నో భాషల్లో సోనీ లీవ్ కంటెంట్‌ను సృష్టించింది. రాకేట్ బాయ్స్, గుల్లాక్, స్కామ్ 1992 ది హర్షద్ మెహతా స్టోరీ, మహారాణి, అవరోధ్, కాలేజ్ రొమాన్స్, అందేఖీ, యువర్ హానర్, ఇరు దురువం ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ సిరీస్‌లను అందించింది.
లైవ్ క్రికెట్, ఫుల్ బాల్, టెన్నిస్, బాస్కెట్ బాల్, రేసింగ్, ఫైట్ స్పోర్ట్స్ అంటూ ఇలా ఎన్నో ప్రోగ్రాంలతో ఏడాది అంతా వినోదాన్ని అందిస్తూనే వుంటుంది. యూఈఎఫ్ఏ చాంపియన్స్ లీగ్, రోనాల్డ్ గారోస్, ది యూఎస్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, డేవిస్ కప్, డబ్ల్యూ డబ్ల్యూఈ, ఎఫ్ఏ కప్, అల్టీమేటింగ్ ఫైటింగ్ చాంపియన్ షిప్, యూఈఎఫ్ ఏ యూరోప్ లీగ్, ఆ యాషెస్, ఏటీపీ 1000 మాస్టర్స్ టోర్నమెంట్స్, రోష్న్ సౌది ప్రో లీగ్ వంటి ఎన్నో ఆటలను అందిస్తుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్, శ్రీలంక క్రికెట్, ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డ్ హక్కులను కూడా సోనీ లీవ్ సొంతం చేసుకుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments