రేపు ఉదయం 'గాంధీ' సిబ్బందిపై హెలికాఫ్టర్లతో పూలవర్షం
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా వ్యాధి నియంత్రణలో వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు ప్రాణాలను పణంగా పెట్టి మరీ యుద్ధం చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వారి పాత్ర ఎనలేనిదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. విదేశాలతో పోలిస్తే మనదేశంలోని డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు నంబర్ వన్‌గా పనిచేస్తున్నారు.. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. అందుకే ఇలా కోవిడ్ కట్టడికి విశ్రాంతి లేకుండా పని చేస్తున్న కరోనా వారియర్స్‌కు కృతజ్ఞతలు తెలపడానికి భారత త్రివిధ దళాలు సిద్ధమయ్యాయి. ఈ సందర్భంగా.. కోవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రులపై ఆదివారం (మే-03) ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానాలు పూలవర్షం కురిపించనున్నాయి. ఈ మేరకు ఈ విషయాన్ని త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ మీడియా ముఖంగా వెల్లడించారు. వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, హోం గార్డులు, డెలవరీ బాయ్స్, మీడియాకు కూడా ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు.
గాంధీ ఆస్పత్రిపై..
అయితే ఈ ఖాతాలో తెలుగు రాష్ట్రాల్లోని ఆస్పత్రులు కూడా ఉన్నాయి. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి వైద్య సిబ్బందికి సంఘీభావంగా ఉదయం 09:30 గంటలకు ఐఏఎఫ్ హెలికాఫ్టర్ ద్వారా పూలవర్షం కురిపించనున్నారు. అయితే ఏపీలో ఏ ఆస్పత్రిలో ఇలా సంఘీభావం ఉంటుందనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. శ్రీనగర్ నుంచి తిరువనంతపురం వరకు గగనతల విన్యాసాలు నిర్వహించనున్నామని.. తూర్పున దిబ్రూగఢ్ నుంచి పశ్చిమాన గుజరాత్‌లోని కచ్ వరకు మరో విన్యసాం ఉంటుందని రావత్ తెలిపారు. దేశ వ్యాప్తంగా కరోనా బాధితులకు చికిత్స చేసిన ఆస్పత్రులపై హెలికాప్టర్లతో పూలవర్షం కురిపిస్తామని శుక్రవారం నాడు మీడియా ముఖంగా తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout