అనవసరంగా నన్ను లాగుతున్నారు.. పోర్న్ వీడియోస్ వివాదంపై ప్రముఖ నటి
Send us your feedback to audioarticles@vaarta.com
రాజ్ కుంద్రా పోర్న్ వీడియోస్ వివాదం రోజుకొక మలుపు తిరుగుతోంది. రాజ్ కుంద్రా ఏ ఏ యాప్స్ కోసం పోర్న్ వీడియోస్ నిర్మించారు.. అందులో నటించిన నటీనటులు ఎవరు ? ఇలాంటి విషయాలన్నింటిలో కీలక ఆధారాలు సేకరించిన ముంబై పోలీసులు ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు.
ఇదీ చదవండి: ప్రభాస్, దీపికా పదుకొనె 'ప్రాజెక్ట్ కె' లో సమంత.. 200 రోజులా?
మరోవైపు రాజ్ కుంద్రా, అతని సన్నిహితులు మాత్రం అవి పోర్న్ చిత్రాలు కాదని, ఎరోటిక్ మూవీస్ అనే వాదన కొనసాగిస్తున్నారు. తాజాగా ఈ వివాదంలో ప్రముఖ నటి ఫ్లోరా షైనీ పేరు వార్తల్లో నిలిచింది. అయితే తన పేరునిఈ వివాదంలోకి అనవసరంగా లాగడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఫ్లోరా షైనీ తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఫ్లోరా షైనీ గందీ బాత్ అనే బోల్డ్ కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ లో నటించింది. రాజ్ కుంద్రా, అతడి సన్నిహితుడు ఉమేష్ కామంత్ మధ్య జరిగిన వాట్సాప్ చాట్ లో ఫ్లోరా షైనీ ప్రస్తావన కూడా ఉందట.
బాలి ఫేమ్ అనే సిరీస్ కోసం ఫ్లోరా షైనీ తో సాంగ్ చేయించాలని కుంద్రా, ఉమేష్ మధ్య చర్చ జరిగిందని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఫ్లోరా షైనీ స్పందించారు. రాజ్ కుంద్రాతో కానీ, ఉమేష్ తో కానీ, వాళ్ళ సన్నిహితులతో కానీ తానెప్పుడూ మాట్లాడలేదని.. వాళ్ళెవరూ సాంగ్ కోసం తనని సంప్రదించలేదని పేర్కొంది.
ఈ వివాదంలో నాకు ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ కొందరు పనిగట్టుకుని ఈ వివాదంలోకి నన్ను లాగాలని చూస్తున్నట్లు ఫ్లోరా షైనీ వాపోయింది. గందీ బాత్ లో నటించానని అందరూ అంటున్నారు. నేను నటించిన మిగిలిన చిత్రాలు స్త్రీ, బేగం జాన్, లక్ష్మీ చిత్రాలు ఎవ్వరికీ గుర్తుకు రావడం లేదా అని ఫ్లోరా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫ్లోరా షైనీ తెలుగులో నరసింహనాయుడు, నువ్వు నాకు నచ్చావ్, సొంతం, ప్రేమతో రా లాంటి చిత్రాల్లో నటించింది.
రాజ్ కుంద్రా పోర్న్ కేసుల వ్యవహారంలో కొందరు అధికారులు కూడా ఇవాల్వ్ అయినట్లు పోలీసులు గుర్తించారు. కోర్టు రాజ్ కుంద్రా రిమాండ్ ని మరో 14 రోజులు పొడిగించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments