రామ్ జోడిగా ఓ ప్లాప్ హీరోయిన్‌..మ‌రో హిట్ భామ‌

  • IndiaGlitz, [Saturday,October 19 2019]

తొలి చిత్రం 'నేల‌టిక్కెట్టు'తో హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన ముద్దుగుమ్మ మాళ‌వికా శ‌ర్మ‌. ఈ ముంబై ముద్దుగుమ్మ కోటి ఆశ‌ల‌తో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. అయితే నేల టిక్కెట్టు డిజాస్ట‌ర్ కావ‌డంతో మాళ‌వికను పెద్ద‌గా ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. సోష‌ల్ మీడియాలో గ్లామ‌ర‌స్‌గా క‌న‌ప‌డ్డా కూడా ప‌క్క‌న పెట్టేశారు. దాదాపు ఏడాది త‌ర్వాత ఈ సొగ‌స‌రి మ‌రో తెలుగు సినిమాలో న‌టించే అవకాశాన్ని ద‌క్కించుకుంది. వివ‌రాల్లోకెళ్తే.. రామ్ హీరోగా కిషోర్ తిరుమ‌ల తెర‌కెక్కించ‌బోతున్న త‌మిళ చిత్రం 'త‌డం' తెలుగు రీమేక్‌లో ఇద్ద‌రు హీరోయిన్స్ ఖ‌రారైయ్యార‌ట‌. వారిలో ఒక‌రు మాళ‌వికా శ‌ర్మ కాగా.. మ‌రో ముద్దుగుమ్మ కోలీవుడ్ సుంద‌రి నివేదా పేతురాజ్‌.

జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా మంచి పాత్ర అనిపిస్తే సెకండ్ హీరోయిన్‌గా అయినా చేయ‌డానికి నివేదా పేతురాజ్ వెన‌కాడ‌టం లేదు. ఈ సంద‌ర్భంలో నివేదా వ‌చ్చిన అవ‌కాశాన్ని జార‌విడుచుకోవ‌డం లేదు. అలా రామ్ సినిమాలో న‌టించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. ఈ ఏడాది ఇస్మార్ట్ శంక‌ర్ త‌ర్వాత రామ్ కాస్త గ్యాప్ తీసుకుని త‌డం రీమేక్‌లో న‌టిస్తున్నాడు. నేను శైల‌జ‌, ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ చిత్రాల త‌ర్వాత రామ్‌, కిషోర్ తిరుమ‌ల కాంబినేష‌న్‌లో రాబోతున్న చిత్ర‌మిది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంది.

More News

దిల్‌రాజు, క్రిష్ నిర్మాణంలో అవ‌స‌రాల శ్రీనివాస్ హీరోగా `నూటొక్క జిల్లాల‌ అంద‌గాడు` కొత్త చిత్రం

మంచి తెలుగు సినిమాల‌ను ప్రేక్ష‌కుల‌ను అందించాల‌ని కోరుకునే నిర్మాత‌ల్లో నిర్మాత దిల్‌రాజు ముందు వ‌రుస‌లో ఉంటారు.

'భగత్ సింగ్ నగర్' ఆడియో విడుదల చేసిన మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్

భగత్ సింగ్ నగర్ చిత్ర ఆడియో లాంచ్ కార్యక్రమం వైజాగ్ లో వి.ఎమ్.ఆర్.డి.ఎ చిల్డర్న్స్ అరినలో జరిగింది.

పురంధేశ్వరి‌కి జగన్ బంపరాఫర్‌..  కీలక పదవి!

ఏపీ సీఎం వైఎస్ జగన్.. బీజేపీ మహిళ నేత పురంధేశ్వరికి బంపరాఫర్ ఇచ్చారా..? ఆమె వైసీపీ తీర్థం పుచ్చుకుంటే సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారా..?

భార‌తీయుడు 2: ఓ యాక్ష‌న్ స‌న్నివేశం కోసం క‌ళ్లు చెదిరే బ‌డ్జెట్‌

శంక‌ర్ అంటేనే గ్రాండియ‌ర్‌. ప్ర‌తి సీన్‌ను తెర‌పై ఆయ‌న ఓ అద్భుతంగా ఆవిష్క‌రించాల‌ని ప్ర‌య‌త్నాలు చే్స్తుంటారు.

ఏపీ ప్రజలకు జగన్ శుభావార్త.. నవంబర్ 1 నుంచి..!

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మరోసారి వరాలజల్లు కురిపించారు. శుక్రవారం నాడు ఆరోగ్యశాఖపై ఉన్నతాధికారులు సమీక్షా సమావేశం జరిగింది.