రామ్ జోడిగా ఓ ప్లాప్ హీరోయిన్..మరో హిట్ భామ
Send us your feedback to audioarticles@vaarta.com
తొలి చిత్రం `నేలటిక్కెట్టు`తో హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన ముద్దుగుమ్మ మాళవికా శర్మ. ఈ ముంబై ముద్దుగుమ్మ కోటి ఆశలతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. అయితే నేల టిక్కెట్టు డిజాస్టర్ కావడంతో మాళవికను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. సోషల్ మీడియాలో గ్లామరస్‌గా కనపడ్డా కూడా పక్కన పెట్టేశారు. దాదాపు ఏడాది తర్వాత ఈ సొగసరి మరో తెలుగు సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. వివరాల్లోకెళ్తే.. రామ్ హీరోగా కిషోర్ తిరుమల తెరకెక్కించబోతున్న తమిళ చిత్రం `తడం` తెలుగు రీమేక్‌లో ఇద్దరు హీరోయిన్స్ ఖరారైయ్యారట. వారిలో ఒకరు మాళవికా శర్మ కాగా.. మరో ముద్దుగుమ్మ కోలీవుడ్ సుందరి నివేదా పేతురాజ్.
జయాపజయాలతో సంబంధం లేకుండా మంచి పాత్ర అనిపిస్తే సెకండ్ హీరోయిన్‌గా అయినా చేయడానికి నివేదా పేతురాజ్ వెనకాడటం లేదు. ఈ సందర్భంలో నివేదా వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోవడం లేదు. అలా రామ్ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ ఏడాది ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ కాస్త గ్యాప్ తీసుకుని తడం రీమేక్‌లో నటిస్తున్నాడు. నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ చిత్రాల తర్వాత రామ్, కిషోర్ తిరుమల కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రమిది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com