ప్లాప్ డైరెక్టర్ తో వెంకటేష్ అసురన్?
Send us your feedback to audioarticles@vaarta.com
‘ఎఫ్2’తో తిరుగులేని విజయాన్ని అందుకున్న హీరో వెంకటేశ్ దాని తర్వాత చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా తమిళ్లో సూపర్‌హిట్ అయిన ‘అసురన్' రీమేక్‌లో వెంకటేశ్ నటిస్తున్న విషయం తెలిసిందే. తమిళ్లో ఈ సినిమా ధనుష్, మంజు వారియర్ జంటగా తెరకెక్కింది. ఈ సినిమా రీమేక్‌ని ఎవరు డైరెక్ట్ చేస్తారనే విషయంలో కొంత తర్జనభర్జన జరిగింది.
ఇటీవల హను రాఘవపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాడని వార్తలు బలంగా వినిపించాయి. అయితే తాజా సమాచారం మేరకు ఆ అవకాశం శ్రీకాంత్ అడ్డాలను వరించిందని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ సినిమాలో వెంకటేశ్ సరసన శ్రియా శరన్ హీరోయిన్గా నటిస్తుందంటున్నారు. ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మించనున్నారు. అతి త్వరలో చిత్రయూనిట్ ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేయనున్నారు.
ప్రస్తుతం వెంకటేష్ ‘వెంకీ మామ’ చిత్రంలో నటిస్తున్నారు. వెంకటేశ్, నాగచైతన్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్‌ను కె.ఎస్.రవీంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్ 13న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటునారు. పాయల్ రాజ్‌పుత్, రాశీఖన్నా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com