హైదరాబాద్‌కు ఫ్లిప్‌కార్ట్ డాటా సెంటర్ వచ్చేసిందోచ్!
- IndiaGlitz, [Tuesday,April 23 2019]
దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్.. ఇటీవల హైదరాబాద్‌లో డాటా సెంటర్‌ను ఆవిష్కరించింది. కాగా.. ఇది తెలంగాణలో మొదటిది కాగా.. దేశంలో రెండోది కావడం విశేషమని చెప్పుకోవచ్చు. ‘కంట్రోల్ ఎస్’ భాగస్వామ్యంతో నిర్మించిన ఈ సెంటర్‌ను తెలంగాణ ఐటీ, వాణిజ్య శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ సోమవారం ప్రారంభించారు. ఈ సెంటర్ ద్వారా ఎక్కువ సంఖ్యలో స్థానిక తయారీ సంస్థలు, విక్రయదారులు, ఎంఎస్ఎంఈలను చేరుకునేందుకు వీలవుతుందని సదరు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
అంతేకాదు.. ఈ డేటా సెంటర్ ద్వారా నాణ్యమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ చీఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఆఫీసర్ రజనీష్ కుమార్ మీడియాకు వివరించారు. కాగా ఈ సెంటర్ పూర్తిగా పునరుత్పాదక ఇంధనతో నడవనుంది. కాగా ఇలా డేటా సెంటర్స్ కోసం ప్రత్యేకంగా పాలసీని తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని.. ఈ పాలసీ వల్ల రాష్ట్రానికి వచ్చేందుకు అనేక కంపెనీలు రెడీగా ఉన్నాయని జయేశ్ రంజన్ మీడియాకు వివరించారు.
కాగా.. రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహకారం బాగుందని ఈ సందర్భంగా రజనీష్ కుమార్ ప్రశంసల వర్ఫం కురిపించారు. సర్కార్ మాకు అన్నివిధాలా చేయూతనిచ్చిందని.. చేసిన ప్రతీ ప్రయత్నం ఫలించేలా దోహదపడిందన్నారు. హైదరాబాద్‌లో మా నూతన డాటా సెంటర్.. పర్యావరణ హితంగా రాష్ట్రంలో మా పెట్టుబడుల కృత నిశ్చయానికి ప్రతీక అని రజనీశ్ చెప్పుకొచ్చారు.