రిహార్సల్స్ చేస్తూ కుప్పకూలిన విమానాలు
Send us your feedback to audioarticles@vaarta.com
ఏరో ఇండియా ఎక్స్పో-2019 కోసం బెంగళూరులోని ఎలహంక ఎయిర్‌బేస్ వద్ద రిహార్సల్స్ చేస్తుండగా రెండు విమానాలు పరస్పరం ఢీ కొన్ని కుప్పకూలాయి. ఇద్దరు ఫైలట్స్‌కు క్షేమంగా భయపడగా.. ఈ దుర్ఘటనలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సహాయక ఫైలట్ మరణించాడు. అయితే విమానాల్లో ఫైలట్ కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా..? లేదా ఫైలట్ ఒక్కడే ఉన్నాడా..? అనే విషయం తెలియరాలేదు. రెండు విమానాలు ఒక్కసారిగా కుప్పకూలడంతో పూర్తిగా దగ్ధమయ్యాయి.
స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న ఐపీఎస్ అధికారి ఎమ్ఎన్ రెడ్డి పరిశీలించారు. అయితే స్థానికులు, చుట్టుపక్కలుండే ఇళ్లకు ఎలాంటి ప్రమాదం జరగలేదని ఆయన నిర్ధారించారు. కాగా ఈ ఘటన నిట్టే మీనాక్షీ ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలో చోటు చేసుకుంది. ఒక్కసారిగా భారీ శబ్ధం రావడంతో ఇళ్లలో ఉన్న జనాలు భయంతో పరుగులు తీశారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments