ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి సాయమందిస్తూ.. ఐదుగురి దుర్మరణం

  • IndiaGlitz, [Saturday,December 19 2020]

ముక్కూ మొహం తెలియకున్నా.. తోటి మనిషి ప్రమాదంలో గాయపడ్డాడని వారి హృదయం తల్లడిల్లిపోయింది. పాపం అంటూ అతడిని తమకు తెలిసిన ప్రథమ చికిత్సను అయినా అందించాలని ఆ నిరుపేదలు వెళ్లారు. అంతే ఎక్కడి నుంచి వచ్చిందో కానీ పాడు లారీ ఆ ఆరుగురి పైనుంచి వెళ్లిపోయింది. కళ్లు మూసి తెరిచేలోగా దారుణం జరిగిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మిగిలిన నలుగురూ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఒక్కరు మాత్రం ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలంలోని రాఘవంపల్లి వద్ద శుక్రవారం రాత్రి చోటుచేసుకొంది. రాఘవంపల్లికి చెందిన రైతు శ్రీకాంతప్ప ఒక్కగానొక్క కుమారుడు రాజశేఖర్‌(20). కాగా.. రాజశేఖర్ అనంతపురం నుంచి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వస్తుండగా రాఘవంపల్లి క్రాస్‌ వద్ద కదిరి నుంచి అనంతపురం వెళ్తున్న కారు ఆయన బైకును ఢీకొంది. ఈ ప్రమాదంలో రాజశేఖర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. కారులోని వారు మాత్రం రాజశేఖర్ పరిస్థితిని కూడా గమనించకుండా.. కారును అక్కడే వదిలేసి పరారయ్యారు. అదే సమయంలో అటుగా వెళుతున్న కూలీలు.. రాజశేఖర్ తీవ్రంగా గాయపడి ఉండటాన్ని గమనించి ఆగిపోయారు.

వెంటనే తాము ప్రయాణిస్తున్న ఆటో దిగి రాజశేఖర్‌కు సాయం అందించేందుకు వెళ్లారు. బాధితుడికి వారు సపర్యలు చేస్తుండగానే బత్తలపల్లి వైపు నుంచి వేగంగా వస్తున్న సిమెంట్‌ లారీ కూలీలపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రాజశేఖర్‌తో పాటు నలుగురు కూలీలు అక్కడికక్కడే మరణించారు. వారిని తాడిమర్రి మండలం నార్శింపల్లికి చెందిన శ్రీనివాసులు(40), ముష్టూరుకు చెందిన శివమ్మ(50), సంజీవపురానికి చెందిన సూరి(45), వలి(50)లుగా పోలీసులు గుర్తించారు. వీరిలో శ్రీనివాసులు ఘటనాస్థలంలోనే మరణించగా, మిగతా వారు వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. లింగారెడ్డిపల్లికి చెందిన రాజు అనే కూలీ అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదానికి కారణమైన కారు, లారీ డ్రైవర్లు వాహనాలు వదిలేసి పరారయ్యారు.

More News

తెలంగాణలో రాజా సాబ్ కొడుకో.. నిజాం చెంచానో సీఎం కాడు: తరుణ్ ఛుగ్

తెలంగాణ రాష్ట్రానికి 2023లో సామాన్యుడే సీఎం అవుతారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ ఛుగ్‌ ప్రకటించారు.

నన్నూ, ఆర్జీవీని చంపేయండి: నట్టి కుమార్

తనను, ఆర్జీవీని చంపేసి అనంతరం థియేటర్‌ను ధ్వంసం చేయాలని నిర్మాత నట్టి కుమార్ పేర్కొన్నారు.

సినీ ఇండస్ట్రీకి రీస్టార్ట్ ప్యాకేజి ప్రకటించిన ఏపీ..

లాక్‌డౌన్ కారణంగా తీవ్ర స్థాయిలో నష్టపోయిన పరిశ్రమ ఏదైనా ఉంది అంటే అది సినీ పరిశ్రమే. ఆ పరిశ్రమకు కోలుకోలేని దెబ్బ తగిలింది.

సింగర్ సునీతను పెళ్లెప్పుడని అడిగితే..

గత కొద్ది రోజులుగా సింగర్ సునీత తరచూ ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే వస్తున్నారు.

భద్రాద్రిలో తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనాలకు భక్తులకు అనుమతి లేదు

వైకుంఠ ఏకాదశి వచ్చిందంటే చాలు.. పండుగంతా భద్రాచలంలోనే ఉన్నట్టుటుంది. అంత వైభవంగా వైకుంఠ ఏకాదశి ఎక్కడా జరగదంటే అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది.