ఆ 8 మందిలో ఐదుగురి గుర్తింపు.. మరో ముగ్గురు ఎవరు?

  • IndiaGlitz, [Friday,December 25 2020]

ఏపీలో కొత్త రకం కరోనా వైరస్ కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. కాగా... బ్రిటన్ నుంచి వచ్చిన తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన మహిళకు పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో జిల్లా అధికార యంత్రాంగమంతా అప్రమత్తమైంది. సదరు మహిళతో పాటు ఢిల్లీ నుంచి వచ్చిన ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో ఎంతమంది ప్రయాణించారు? వారెవరు? అనే దానిపై ఆరా తీసి ఎట్టకేలకు వారిని సైతం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించే పనిలో ఉన్నారు. కాగా.. బాధిత మహిళ ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో తన కుమారుడితో కలిసి ఈ నెల 22న డిల్లీ నుంచి రాజమహేంద్రవరంకు చేరుకుంది. ఆమెతో పాటు ఆమె కుమారుడిని ప్రత్యేక ఐసోలేషన్‌లో ఉంచి వైద్యులు చికిత్స నిర్వహిస్తున్నారు.

కాగా.. ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో బాధితురాలితో పాటు ఎనిమిది మంది విశాఖ వాసులు ప్రయాణించినట్టు అధికారులు గుర్తించారు. కాగా.. వారిలో ఇద్దరు వైద్యుల పిల్లలుగా అధికారులు గుర్తించారు. ముగ్గురు వ్యక్తులు అనకాపల్లిలోని బృందావన్ లాడ్జిలో ఉన్నట్టు గుర్తించిన అధికారులు వారిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. మిగిలిన ముగ్గురినీ ట్రేస్ అవుట్ చేసే పనిలో ఉన్నారు. ఈ ఎనిమిది మందినీ కేజీహెచ్‌కు తరలించి చికిత్సను అందించాలని అధికారులు భావిస్తున్నారు. కాగా.. యూకే నుంచి రాజమహేంద్రవరానికి చేరుకున్న మహిళకు సోకింది కొత్తరకం కరోనా వైరస్సా.. కాదా? అనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. దీనిని గుర్తించేందుకు నమూనాలను హైదరాబాద్‌లోని సీసీఎంబీకి పంపించారు. ఆమె కుమారుడికి మాత్రం కరోనా నెగిటివ్ వచ్చింది.

రాజమహేంద్రవరం రూరల్‌ మండలం హుక్కుంపేట సమీపంలోని రామకృష్ణనగర్‌కు చెందిన ఆంగ్లో ఇండియన్‌ మహిళ యూకేలో కరోనా పరీక్షలు చేయించుకుని ఫలితం రాకముందే.. అక్కడి నుంచి విమానంలో ఢిల్లీకి వచ్చారు. ఆమెను రిసీవ్ చేసుకునేందుకు ఆమె కుమారుడు ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కూడా సదరు మహిళకు కరోనా పరీక్షలు చేశారు. అయితే ఫలితం వచ్చే వరకూ ఆమె అక్కడే క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా అధికారులు సూచించారు. కానీ ఆమె అక్కడి నుంచి పరారై కొడుకుతో కలిసి రాజమహేంద్రవరం రావడానికి బయలుదేరారు. అయితే పరీక్షల్లో ఆమెకు పాజిటివ్ రావడంతో అక్కడి అధికారులు ఏపీకి సమాచారం అందించారు. ఆమె ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో రాజమహేంద్రవరానికి బయల్దేరిందన్న విషయాన్ని తెలుసుకున్న అధికారులు.. ట్రైన్ అక్కడికి చేరుకున్న వెంటనే ఆమెను గుర్తించి ఆసుపత్రికి తరలించారు.

More News

హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం: సీపీ సజ్జనార్‌

కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే ఈ ఏడాది మార్చి నుంచి అన్ని పండుగలపై ఆంక్షలు కొనసాగాయి.

బ్రేకింగ్: రజినీకాంత్‌కు తీవ్ర అస్వస్థత.. అపోలోకి తరలింపు

సూపర్ స్టార్ రజినీకాంత్‌ తీవ్ర అస్వస్థతకు గురయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘అన్నాత్తే’ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలో

టక్ జగదీష్’ ఫస్ట్‌లుక్‌ విడుదల..

ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని చేస్తున్న చిత్రం ‘టక్ జగదీష్’. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి అద్భుతమైన హిట్స్ ఇచ్చిన దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభమైన థియేటర్లు..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు థియేటర్లు తెరుచుకుంటున్నాయి. మంచి రోజు కావడంతో థియేటర్ల యాజమాన్యం నేటి నుంచి థియేటర్లను పునః ప్రారంభించింది.

అల్లు అర్జున్ నాకు లైన్ వేసేవాడు: నటి షాకింగ్ కామెంట్స్

వనితా విజయ్ కుమార్.. ఆమె సినిమాల్లో నటించే సమయంలో ఎందరికి తెలుసో.. తెలియదు కానీ ఇప్పుడు మాత్రం తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు.