ఎన్నికలు లేకుండానే ఏపీలో ఐదుగురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు-2019కు ముందు జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఐదు స్థానాలు ఖాళీ ఉండగా ఐదుగురు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో వాటిని పరిశీలించిన అధికారులు ఆమోదించారు. పైగా వీరికి పోటీగానీ, రెబల్ అభ్యర్థులుగానీ ఎవరూ లేకపోవడంతో ఈ ఐదు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. రెండ్రోజుల్లో అనగా సోమవారం రోజున ఎన్నిక పత్రాలను అధికారుల చేత ఆ ఐదుగురు అభ్యర్థులు అందుకోనున్నారు. ఎన్నికల ప్రక్రియ లేకుండానే ఈ ఐదుగురు ఎమ్మెల్సీలు అయ్యారు. సోమవారం నుంచి వీరి పేరుకు ముందు ‘ఎమ్మెల్సీ’ యాడ్ కానుందన్న మాట.
టీడీపీ నుంచి:
1. మంత్రి యనమల రామకృష్ణుడు
2. ఏపీ ఎన్జీవోల సంఘం మాజీ అధ్యక్షుడు అశోక్బాబుతో
3. దువ్వారపు రామారావు
4. బీటీ నాయుడు
వైసీపీ తరఫున:
05. బీసీ నేత జంగా కృష్ణమూర్తి
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments