పవన్ చుట్టూ ఐదుగురు ఐటెం గర్ల్స్.. పోస్టర్ రిలీజ్!
Send us your feedback to audioarticles@vaarta.com
ఇదేంటి పవన్ కల్యాణ్ సినిమాలకు దూరంగా ఉన్నాడు కదా.. మరి ఆయనకేంటి సంబంధమని ఆశ్చర్యపోతున్నారా..? అబ్బే అదేంలేదండోయ్.. ఈయన రియల్ పవన్ కాదు.. రీల్ పవన్ మాత్రమే. టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పోస్టర్లు, సాంగ్స్, చిత్రంలోని పాత్రధారులను పరిచయం చేశాడు. అయితే దీపావళి సందర్భంగా ఈనెల 27న ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్టు ఆర్జీవీ ఇప్పటికే ప్రకటించారు. అయితే అంతకు ముందే చిత్రంలో నటించే మరికొందరి పాత్రధారులను వర్మ ట్విట్టర్ వేదికగా పరిచయం చేస్తున్నాడు.
పవన్ చుట్టూ ఐదుగురు ఐటెమ్స్!
తాజాగా.. పవన్ కల్యాణ్‌కు సంబంధించిన పోస్టర్‌ను ఆయన రిలీజ్ చేశాడు. ఈ పోస్టర్‌ను బట్టి చూస్తే పవన్‌పై ఆర్జీవీకి ఎంత కోపం ఉందో.. ఎందుకిలా టార్గెట్ చేస్తున్నారన్నది తెలుస్తుంది. వాస్తవానికి పాత్రధారులను పరిచయం చేయడంలో ఆర్జీవీ దిట్ట అనే పేరుంది. ఇందుకు నిదర్శనమే ఇప్పటి వరకూ ఆయన సినిమాల్లో పాత్రలే. ఇక పవన్ లుక్ విషయానికొస్తే.. అచ్చంగా పవన్ కల్యాణ్ గెటప్ ఉండటం.. ఆయన చుట్టూ ఐదుగురు ఐటెం గర్ల్స్, అచ్చుగుద్దినట్లుగా అదే హెయిర్ స్టైల్, జనసేన సింబల్, ఎర్ర తుండుతో పవన్ పోస్టర్‌ను ఆర్జీవీ దించేశాడు. అ లుక్ చూసిన పవన్ అభిమానులు, కార్యకర్తలు పవన్‌ను ఆర్జీవీ ఎందుకిలా చూపిస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహానికి లోనవుతున్నారు. మరోవైపు ఈ పోస్టర్‌పై నెటిజన్లు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. అయితే పవన్‌ను ఇలా చూపించడం ద్వారా ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారో అనేది ఒక్క ఆర్జీవీకే ఎరుక.
రియాక్షన్ ఉంటుందా!
కాగా.. ఇప్పటికే వైఎస్ జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్, కేఏ పాల్, నారా లోకేష్‌లను దాదాపు పోలిక ఉన్నట్టుగా పాత్రలను తీర్చిదిద్దిన విషయం విదితమే. అయితే తనపై విమర్శలకు మీడియా, సోషల్ మీడియా వేదికగా స్పందించే పవన్.. ఆర్జీవీ పోస్టర్ వ్యవహారంపై ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments