గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
Send us your feedback to audioarticles@vaarta.com
గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద టిప్పర్ లారీ, కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి. కాగా.. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు క్షతగాత్రుడిని గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ప్రమాదం ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరిగింది.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి కారణం అతి వేగమేనని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో సంతోష్(25), మనోహర్(22), భరద్వాజ్(20), రోషన్, పవన్‌గా గుర్తించారు. మృతులంతా 25 ఏళ్ల లోపు వాళ్లే కావడం గమనార్హం. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతులంతా మాదాపుర్ అయ్యప్ప సొసైటీకి చెందినవారుగా పోలీసులు గుర్తించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com