Bigg Boss 7 Telugu : శుభశ్రీ, గౌతమ్ ఔట్.. ట్విస్ట్ ఇచ్చిన నాగ్, బిగ్‌బాస్ హౌస్‌లోకి ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 7 తెలుగులో ఆదివారం నాటి ఎపిసోడ్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించింది. ఊహించని ట్విస్టులు, ఫన్, టాస్క్‌లు, కొత్త కంటెస్టెంట్స్ ఎంట్రీతో నరాలు తెగె ఉత్కంఠ మధ్య నడిచింది. ప్రతి ఆదివారం ఎవరో ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యేవారు. అయితే ఈసారి ఎవ్వరూ ఊహించని విధంగా ఇద్దరు ఇంటి సభ్యులను డబుల్ ఎలిమినేట్ చేశారు. ప్రతి సండే సేవింగ్‌తో మొదలయ్యే ఎపిసోడ్ ఇవాళ మాత్రం ఎలిమినేషన్‌తో మొదలెట్టారు నాగార్జున. శివాజీ, టేస్టీ తేజ, గౌతమ్, ప్రియాంక, ప్రిన్స్ యావర్ , శుభశ్రీ, అమర్‌దీప్‌లు ఈవారం నామినేషన్స్‌లో వున్నారు. నాగార్జున వచ్చి రావడంతోనే నామినేషన్స్‌లో వున్నవారిని యాక్టివిటీ ఏరియాకు రమ్మని పిలిచారు. ఆ తర్వాత లైట్స్ అన్నీ ఆపేసి శుభశ్రీని బయటకు తీసుకొచ్చారు. లైట్స్ వెలిగిన తర్వాత శుభశ్రీ నాగార్జున పక్కన కనిపించేసరికి కంటెస్టెంట్స్ అంతా షాక్ అయ్యారు. ఈ సందర్భంగా ఇంటిలో తన జ్ఞాపకాలను గుర్తుచేసుకుని అందరికీ వీడ్కోలు పలికింది శుభశ్రీ.
ఈ షాక్ నుంచి తేరుకునేలోగా మరో బ్రేకింగ్ చెప్పారు నాగ్. ఇంకా నామినేషన్స్‌లో వున్న ఆరుగురి నుంచి మరొకరు ఎలిమినేట్ అవుతారని చెప్పారు నాగార్జున. ఆడియన్స్ ఓట్ల ఆధారంగా ప్రియాంక, అమర్దీప్ , శివాజీ, ప్రిన్స్ యావర్‌లు సేవ్ అయ్యారు. చివరికి గౌతమ్, తేజాలే మిగిలారు. వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవ్వాలనే ఇంటి సభ్యులే నిర్ణయిస్తారని నాగార్జున తెలిపారు. తర్వాత గౌతమ్, తేజల ఎదుట రెండు గ్లాస్ కంటైనర్స్ పెట్టారు. వీరిలో ఎవరైతే ఇంటి నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నారో.. ఇంటి సభ్యులు వారికి ఎదురుగా వున్న కంటైనర్‌లో ఎరుపు రంగు లిక్విడ్ పోయాలి. ఈ టాస్క్‌లో సందీప్ మాత్రమే గౌతమ్ ఇంట్లో వుండాలని కోరుకోగా.. మిగిలిన ఆరుగురు మాత్రం తేజాకే సపోర్ట్ చేశారు. దీంతో గౌతమ్ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు.
అనంతరం స్టేజ్ పైకి వచ్చిన గౌతమ్‌కి టాస్క్ ఇచ్చారు నాగ్. ఇంటి సభ్యుల్లో ఎవరు ఫేక్, ఎవరు రియల్ అనేది చెప్పాలని అడిగారు . ప్రతి ఒక్కరిలో సెకండ్ సైడ్ వుందని.. అది ఇవాళ ప్రూవ్ అయిందని గౌతమ్ వెల్లడించాడు. ప్రిన్స్ యావర్, తేజాలు తప్పించి అందరిలో స్వార్ధం వుందని కామెంట్ చేశాడు. తన తల్లి రాసిన లేఖ జీవితాంతం తనతోనే వుంటుందని చెప్పి గౌతమ్ స్టేజ్‌ను వీడుతుండగా నాగార్జున ట్విస్ట్ ఇచ్చాడు. గౌతమ్ నుంచి లెటర్‌ను లాక్కొని.. నీ ఆట నాకు బాగా నచ్చింది, నీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నా అని చెప్పి సీక్రెట్ రూమ్‌కి పంపారు. అక్కడ ఏం చేయాలి..? ఎలా వుండాలనేది బిగ్‌బాస్ చెబుతాడని నాగ్ తెలిపారు. ఈ ఊహించని ట్విస్ట్‌కు షాకైన గౌతమ్.. ట్విస్ట్ అదిరిపోయిందని కామెంట్ చేశాడు.
అనంతరం వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత ఐదుగురు కంటెస్టెంట్స్ హౌస్‌లోకి ప్రవేశించారు. వారే సీరియల్ నటుడు అర్జున్ అంబటి, కిక్ బాక్సర్ అశ్విని శ్రీ, మ్యూజిక్ డైరెక్టర్ భోలే షావళి, సీరియల్ నటి పూజా మూర్తి, సోషల్ మీడియా ఇన్ఫ్యూయెన్సర్ నయని పావనిలు ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఏ బిగ్‌బాస్ సీజన్లోనూ , ఏ భాషలోనూ జరగని విధంగా ఒకేసారి ఐదుగురు కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వడంతో ప్రేక్షకులు పాత కంటెస్టెంట్స్ షాకయ్యారు. ఇంకా ఎంతమంది వస్తారు రా అంటూ తేజను అడిగాడు శివాజీ. అంతేకాదు.. వీరంతా కన్ఫర్మ్ హౌస్మేట్స్ అని స్పష్టం చేశాడు నాగ్.
వైల్డ్ కార్డ్ ఎంట్రీ ముగిసిన తర్వాత చిన్నా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సిద్ధార్ధ్.. టైగర్ నాగేశ్వరరావు ప్రమోషన్స్‌లో భాగంగా రవితేజ, నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్‌లు బిగ్‌బాస్ స్టేజ్‌పై సందడి చేశారు. అనంతరం కొత్తగా వచ్చిన కంటెస్టెంట్స్‌కు నాగార్జున ప్రత్యక అధికారాలు ఇచ్చారు. అర్జున్, అశ్వినికి హౌస్ ఆఫ్ లగేజ్.. అంటే ఇంటిలో ఎవరెవరి దగ్గర ఏ లగేజ్ వుండాలనేది వీళ్లు నిర్ణయిస్తారు. భోలె షావళి, పూజా మూర్తి, నయని పావనికి హౌస్ ఆఫ్ బెడ్స్ టాస్క్ ఇచ్చారు. అంటే ఇంటి సభ్యుల్లో ఎవరు ఏ బెడ్‌పై పడుకోవాలనే వీరు డిసైడ్ చేస్తారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments