బీఎస్ఎఫ్ క్యాంపులో విషాదం : తోటి సైనికులపై జవాన్ కాల్పులు.. ఐదుగురి మృతి

  • IndiaGlitz, [Monday,March 07 2022]

పంజాబ్‌లో దారుణం జరిగింది. ఓ జవాను తోటి సైనికులపై కాల్పులు జరపడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అమృత్‌సర్‌ సమీపంలోని ఖాసా గ్రామంలో ఉన్న బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ శిబిరంలో ఆదివారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో మరో పదిమంది జవాన్లకు గాయాలయ్యాయి. వారందరికీ స్థానిక గురునానక్‌ దేవ్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘాతుకానికి పాల్పడిన జవానును సత్తెప్పగా గుర్తించారు. తోటి వారిపై కాల్పులు జరిపిన  అనంతరం అతను తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. కాల్పులకు దారితీసిన కారణాలు, ఇతరత్రా వివరాలు తెలియాల్సి ఉంది.

ఇకపోతే.. గతేగాది డిసెంబర్‌లోనూ త్రిపురలో అచ్చం ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. సహోద్యోగి జరిపిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మరణించారు. సెఫజలా జిల్లా కోనాబన్‌లోని మధుపూర్‌లో ఉన్న ఒఎన్‌జిసి జిసిఎస్‌లో ఒక జవాన్‌ ..తన తోటి సైనికులపై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు మరణించారు. చనిపోయిన ఇద్దరు త్రిపుర రాష్ట్ర రైఫిల్స్‌లోని 5వ బెటాలియన్‌కు చెందినవారు. కాల్పుల అనంతరం నిందితుడైన జవాన్‌.. ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు.

More News

సామాజిక సేవలో మహేశ్ పెద్దమనసు.. చిన్నారుల  కోసం, ఆ సంస్థతో కలిసి

సినిమాలు, షూటింగ్‌లు, ఎండార్స్‌మెంట్లు, వ్యాపార వ్యవహారాలతో క్షణం తీరిక లేకుండా వుండే సూపర్‌స్టార్ మహేశ్ బాబు సామాజిక సేవలోనూ ముందుంటారు.

సండే ఫండే విత్ నాగ్ @ బిగ్ బాస్ నాన్ స్టాప్

"డిస్నీ ప్లస్ హాట్ స్టార్" లో నాన్ స్టాప్ గా సంచలనం సృష్టిస్తున్న "బిగ్ బాస్" ఎన్నో కొత్త కొత్త ఆకర్షణలతో, ఆశ్చర్యాలతో మరింత వినోదాన్ని అందిస్తోంది.

నాగశ్రీను వివాదం: మోహన్‌బాబు, మంచు విష్ణులపై మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు

విలక్షణ నటుడు మోహన్బాబు చిక్కుల్లో పడ్డారు. ఆయన తమ సామాజిక వర్గానికి క్షమాపణలు చెప్పాలంటూ నాయి బ్రాహ్మణులు రోడ్డెక్కారు.

పాముకాటుకు విద్యార్థి బలి.. జగన్ చేయూత, బాధిత కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం

విజయనగరం జిల్లా కురుపాంలో గురుకుల హాస్టల్లో ముగ్గురు విద్యార్థులను పాము కాటేసిన ఘటనలో విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

రష్యా - ఉక్రెయిన్ యుద్ధం : కాస్త శాంతించిన పుతిన్.. తాత్కాలికంగా కాల్పుల విరమణ

ఉక్రెయిన్ స్వాధీనమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.