బీఎస్ఎఫ్ క్యాంపులో విషాదం : తోటి సైనికులపై జవాన్ కాల్పులు.. ఐదుగురి మృతి
Send us your feedback to audioarticles@vaarta.com
పంజాబ్‌లో దారుణం జరిగింది. ఓ జవాను తోటి సైనికులపై కాల్పులు జరపడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అమృత్‌సర్ సమీపంలోని ఖాసా గ్రామంలో ఉన్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ శిబిరంలో ఆదివారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో మరో పదిమంది జవాన్లకు గాయాలయ్యాయి. వారందరికీ స్థానిక గురునానక్ దేవ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘాతుకానికి పాల్పడిన జవానును సత్తెప్పగా గుర్తించారు. తోటి వారిపై కాల్పులు జరిపిన అనంతరం అతను తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. కాల్పులకు దారితీసిన కారణాలు, ఇతరత్రా వివరాలు తెలియాల్సి ఉంది.
ఇకపోతే.. గతేగాది డిసెంబర్‌లోనూ త్రిపురలో అచ్చం ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. సహోద్యోగి జరిపిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మరణించారు. సెఫజలా జిల్లా కోనాబన్‌లోని మధుపూర్‌లో ఉన్న ఒఎన్‌జిసి జిసిఎస్‌లో ఒక జవాన్ ..తన తోటి సైనికులపై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు మరణించారు. చనిపోయిన ఇద్దరు త్రిపుర రాష్ట్ర రైఫిల్స్‌లోని 5వ బెటాలియన్‌కు చెందినవారు. కాల్పుల అనంతరం నిందితుడైన జవాన్.. ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout