Kommu Konam Fish: వలలో చిక్కిన అరుదైన చేపలు.. కోటీశ్వరులైన ఇద్దరు జాలర్లు
Send us your feedback to audioarticles@vaarta.com
కొంతమందికి రాత్రికి రాత్రే అదృష్టం కలిసి వస్తుంది. కొందరు జాలర్ల విషయంలో ఈ విషయం ఎన్నో సార్లు రుజువైంది. పూట గడిచేందుకు సైతం అష్టకష్టాలు పడ్డ వేళ.. వలలో అరుదైన చేపలు పడటం అవి కోట్లు పలకడం వంటి ఘటను మనం ఎన్నోసార్లు పేపర్లలో చూశాం. తాజాగా కాకినాడ జిల్లాకు చెందిన ఇద్దరు మత్య్సకారులను అదృష్ట దేవత తలుపు తట్టింది.
13 టన్నుల అరుదైన చేపలు:
వివరాల్లోకి వెళితే.. కాకినాడ, యూ కొమ్ముపల్లి మండలం, ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో కొంతమంది మత్స్యకారులు వేటకు వెళ్లారు. ఈ క్రమంలో సముద్రంలో విసిరిన వలలను పైకి తీసి చూడగా అవాక్కయ్యారు. బంగాళాఖాతంలో మాత్రమే దొరికే అత్యంత అరుదైన కొమ్ముకోనం చేపలు వారి వలలో పడ్డాయి. ఏదో ఒకటి రెండు కాదు.. ఏకంగా 13 టన్నుల చేపలు వలలో పడ్డాయి. వాటిని ఒక్క బోటుతో తరలించటం వారి వల్ల కాలేదు. దీంతో మరో రెండు బోటులను రంగంలోకి దింపారు.
కోటి 20 లక్షలకు వేలం:
రెండు బోటుల్లో చేపల్ని నింపుకుని ఒడ్డుకు చేరారు. ఈ చేపల్ని వేలం వేయగా భారీ ధర పలికాయి. ఏకంగా కోటి 20లక్షల రూపాయలకు వీటిని కొనుగోలు చేశారు వ్యాపారులు. దీంతో మత్స్యకారుల సంతోషానికి హద్దులు లేకుండాపోయింది. సాధారణంగా ఈ చేపలు సముద్రంలో వందల అడుగుల లోతులో సంచరిస్తూ వుంటాయి. ఈ కొమ్ముకోనెం చేపలకు బెంగళూరు, చెన్నై, కోల్కతాలో భారీ డిమాండ్ ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments