Bathini Harinath Goud:విషాదం : చేప మందు ప్రసాదం దాత బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూత

  • IndiaGlitz, [Thursday,August 24 2023]

ఆస్తమా, ఇతర శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి స్వస్థత చేకూర్చేందుకు గాను చేపమందుతో ప్రసాదంతో తెలుగువారికి సుపరిచితులైన బత్తిన కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. బత్తిన సోదరుల్లో పెద్దవారైన బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం బుధవారం రాత్రి విషమించడంతో హరినాథ్ గౌడ్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మరణవార్తతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, తెలుగు ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పలువురు ప్రముఖులు హరినాథ్ గౌడ్ మృతికి సంతాపం తెలియజేశారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు వున్నారు.

176 ఏళ్లుగా చేపమందు పంపిణీ చేస్తోన్న బత్తిని కుటుంబం:

కాగా.. ప్రతి ఏటా మృగశిర కార్తె రోజున హైదరాబాద్ నాంపల్లి గ్రౌండ్స్‌లో ఉబ్బసం రోగులకు చేపమందు పంపిణీ చేస్తున్నారు బత్తిని సోదరులు. గత 176 ఏళ్లుగా వీరి కుటుంబం చేప మందు ఇస్తూ ప్రజలకు సేవ చేస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు సమీప రాష్ట్రాలకు చెందిన వారు కూడా చేపమందు తీసుకోవడానికి తరలివస్తారు. ఇందుకోసం ప్రభుత్వం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ వస్తోంది . తొలుత పాతబస్తీలోనే చేపమందు పంపిణీ చేసేవారు. అయితే భద్రతా కారణాలతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు మార్చారు. శాకాహారులకు బెల్లంతో కలిపి ప్రసాదం ఇస్తారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు చేపమందును తీసుకుంటున్నారు. భోజనం చేసిన మూడు గంటల తర్వాత ముందు తీసుకోవాలి. గర్భిణిలకు మాత్రం ఇవ్వరు.

More News

YS Jagan:జగన్ పెద్ద మనసు.. నాలుగేళ్లుగా పథకాలు అందుకోని వారికి లబ్ధి, 2.62 లక్షల మంది ఖాతాల్లోకి నగదు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పారు.

Chandrayaan-3:చరిత్ర సృష్టించిన ఇస్రో .. చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ సేఫ్ ల్యాండింగ్, జయహో భారత్ అంటోన్న ప్రపంచం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్ధ (ఇస్రో) చరిత్ర సృష్టించింది. అమెరికా, రష్యా, చైనా వంటి అగ్రదేశాలకే క్లిష్టమైన చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండర్‌ను దించింది.

హరీశ్‌రావు‌పై వ్యాఖ్యలు.. మైనంపల్లిపై చర్యలకు బీఆర్ఎస్ హైకమాండ్ సిద్ధం, మల్కాజిగిరికి మరొకరు..?

బీఆర్ఎస్ అగ్రనేత, మంత్రి హరీశ్‌రావుపై మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. తనకు, తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని..

Akira: అకీరా ఎంట్రీపై ట్రోలింగ్ .. కష్టపడనిదే ఏది రాదు : ఇచ్చిపడేసిన రేణూ దేశాయ్

తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ కుటుంబంలో లేనంత మంది హీరోలు మెగా ఫ్యామిలీలో వున్నారు. తొలుత చిరంజీవి ఆయన అడుగుజాడల్లో నాగబాబు, పవన్ కల్యాణ్‌లు ఎంట్రీ ఇచ్చారు.

Chandrayaan 3: నేడే చంద్రయాన్-3 ల్యాండింగ్.. ఊపిరిబిగబెట్టి చూస్తోన్న ప్రపంచం, భారత్‌లో ఉద్విగ్న వాతావరణం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ కీలక ఘట్టానికి చేరుకుంది. దాదాపు 41 రోజుల ప్రయాణం తర్వాత జాబిల్లిపై దిగేందుకు సిద్ధమైంది. ఇస్రోకు సమాంతరంగా రష్యా కూడా