తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే ఇదే తొలిసారి...
Send us your feedback to audioarticles@vaarta.com
వీకెండ్ షోకి హోస్ట్ నాగార్జున డుమ్మా. బిగ్‌బాస్ చరిత్రలోనే ఇలా వీకెండ్ హోస్ట్ లేకుండా నడవడం ఇదే తొలిసారి అయ్యుండొచ్చు. తెలుగులో మాత్రం పక్కాగా ఇదే తొలిసారి. ఈ వీకెండ్ నాగ్ ఆ క్వశ్చన్స్ అడుగుతారా? ఈ క్వశ్చన్స్ అడుగుతారా? అంటూ కొన్ని షోస్ చేసిన వారికి నిరాశ.. మరోవైపు ప్రేక్షకులకు కూడా నిరాశే. వీకెండ్ షోని ఓ రేంజ్‌లో ఎక్స్‌పెక్ట్ చేసి టీవీల ముందు కూర్చున్న ప్రేక్షకులకి ఏదో నడిపించేశారనిపించింది. ఎంతో ఎక్స్‌పెక్ట్ చేసిన ప్రేక్షకుల నిన్న తీసిన సినిమాని ప్రీమియర్ వేస్తామని బిగ్‌బాస్ చెప్పడంతో అంతా చాలా ఖుషీ అయ్యారు. ఇవాళ దీనికి ముందు అరియానా యాంకర్‌గా ఒక్కొక్కరినీ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూ జస్ట్ టైమ్ పాస్ కోసం పెట్టినట్టుగా అనిపించింది. యాంకర్‌గా అరియానా బాగానే చేసింది. ఒక్కొక్కరినీ కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడుగుతూ ఇబ్బంది పెట్టేందుకు ట్రై చేసింది. లాస్యని పప్పు గురించి అడిగింది. అఖిల్‌ని నాగ్ అడిగిన ‘ఎ’లో మీరున్నారా? అని అడిగింది. సొహైల్‌ని మీకు కోపంలో నరాలెందుకు వస్తున్నాయని అడిగింది. సొహైల్ ఆన్సర్ చాలా ఫన్నీగా అనిపించింది. నాగ్ రక్షకుడు మూవీ చూసి వస్తున్నాయని.. అదే నాగ్ ఇచ్చిన వార్నింగ్‌తో పోయాయని సొహైల్ చెప్పాడు.
అవినాష్‌ని పొట్ట గురించి అడిగింది. అరియానా క్వశ్చన్స్ అడిగిన వారిలో అభి, అఖిల్ మినహా మిగిలిన వారంతా పంచులేసి ఆడుకున్నారు. సొహైల్, అవినాష్‌లు పంచులతో ఇరగదీశారు. సినిమాకి అఖిల్ హీరో కాబట్టి అఖిల్ కటౌట్, మెహబూబ్ విలన్ కాబట్టి అతని కటౌట్ పెట్టారు. ఇక సొహైల్‌కి తోపు అని రాశారు. అరియానా షోలో బాగా మాట్లాడిన వాళ్లకు అవార్డులివ్వమంటే అవినాష్, మోనాల్, సొహైల్‌లకు ఇచ్చింది. మొన్న కెప్టెన్సీ టాస్క్‌లో మోనాల్ హ్యాండ్ ఇచ్చినా కూడా అరియానా మాత్రం చాలా జెన్యూన్‌గా మోనాల్ పేరు చెప్పడం చాలా బాగా అనిపించింది. ఇక ప్రీమియర్ షో స్టార్ట్.. ఒకవైపు అఖిల్, మోనాల్.. అరియానా, అవినాష్‌ల మధ్య లవ్ స్టోరీని మంచి ఎమోషన్స్‌తో అదరగొట్టేశారు. దీనిలో బెస్ట్ యాక్టర్ అవార్డ్ అవినాష్‌లకు వెళ్లిపోయింది. నిజానికి మెహబూబ్ యాక్షన్ అదరగొట్టినట్టు అనిపించింది. మోనాల్, అభిలు కూడా మెహబూబ్‌ని ప్రశంసిస్తూ మాట్లాడారు. ఇక మిగిలిన వాళ్లంతా చాలా బాగా నటించారు.
అయితే అఖిల్, మోనాల్‌ల లవ్ స్టోరీని రోజూ చూస్తూనే ఉంటాం కాబట్టి తెరపై కూడా నటిస్తున్నట్టైతే అనిపించలేదు. ఎవరూ ఓవర్ చేయకుండా చాలా చక్కగా నటించినట్టు అనిపించింది. అభికి డైరెక్టర్‌గా 100 మార్క్స్ ఇవ్వొచ్చనిపించింది. సొహైల్, హారిక డ్యాన్స్ ఇరగదీశారు. అందరికీ అవార్డులిచ్చారు. ఈ అవార్డులందుకున్న సమయంలో అఖిల్, అభి, మెహబూబ్‌లు చాలా బాగా మాట్లాడినట్టు అనిపించింది. డైరెక్టర్ అభి వల్లనే తాను అంత బాగా నటించిన గలిగానని అఖిల్ చెప్పడం చాలా బాగా అనిపించింది. ఫోటో చూపిస్తూ వారి గురించి చెప్పమంటే సోహైల్ గురించి అవినాష్ చాలా ఫన్నీగా చెప్పాడు. అప్పుడు కథ వేరుంటది అన్నాడు.. ఇప్పుడు కథేలేదు అంటూ సొహైల్ రెండు పోస్టర్లనూ చూసి అవినాష్ ఫన్నీగా చెప్పిన విధానం ఆకట్టుకుంది. ఇక ఫైనల్‌గా జంటలుగా విడిపోయి డ్యూయెట్ సాంగ్స్‌కి డ్యాన్స్ చేయాలంటే అరియానా, అవినాష్ పెర్ఫార్మెన్స‌్ అదరగొట్టేశారు. మిగిలిన వారంతా కూడా చాలా బాగా డ్యాన్స్ చేశారు. ఇక రేపటి ప్రోమో.. సమంత ఎంట్రీ.. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు గంటల పాటు సామ్ ఓ ఆటాడుకోనుంది. ఇక రేపు ఎలిమినేషన్ కూడా లేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments