తొలిసారి మహేష్ తో....

  • IndiaGlitz, [Wednesday,November 09 2016]

'శ్రీమంతుడు' వంటి ఇండస్ట్రీ హిట్‌ తర్వాత సూపర్‌స్టార్‌ మహేష్‌, సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో మరో ప్రెస్టీజియస్‌ మూవీ రాబోతోంది. డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బేనర్‌పై సూపర్‌హిట్‌ చిత్రాల నిర్మాత డి.వి.వి.దానయ్య ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ర‌వి కె.చంద్ర‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. తెలుగులో మ‌హేష్ అంటే ఇష్ట‌ప‌డే ర‌వి కె.చంద్ర‌న్ మ‌హేష్‌తో చాలా రోజులుగా క‌లిసి ప‌నిచేయాల‌నుకుంటున్నాడ‌ట‌. ఈ సినిమాతో ఆ అవ‌కాశం రావ‌డం పట్ల సోష‌ల్ మీడియాలో ర‌వి.కె.చంద్ర‌న్ త‌న సంతోషాన్ని వ్య‌క్తం చేశాడు. కొర‌టాల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన మిర్చి, శ్రీమంతుడు చిత్రాల‌కు మ‌ది సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేశాడు. జ‌న‌తాగ్యారేజ్‌కు తిరు కెమెరా వ‌ర్క్ చేశాడు. అయితే కొర‌టాల నాలుగో సినిమాకు ర‌వి.కె.చంద్ర‌న్‌ను తీసుకున్నాడు. దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు.

More News

అల్లరి నరేష్ ఇంట్లో దెయ్యం నాకేం భయం రిలీజ్ వాయిదా..!

అల్లరి నరేష్ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో రూపొందిన హర్రర్ ఎంటర్ టైనర్ ఇంట్లో దెయ్యం నాకేం భయం.

వినాయక్ దర్శకత్వంలో గోపీచంద్.....

సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150తో బిజీగా ఉన్నాడు.

ప్రాఫిట్ లో భేతాళుడు....

నకిలీ,డా.సలీంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న విజయ్ ఆంటోని బిచ్చగాడుతో కమర్షియల్గా సెన్సేషనల్ సక్సెస్ ను అందుకున్నాడు.

100 పుణ్యక్షేత్రాల శాతకర్ణి యాత్ర ప్రారంభం..!

నందమూరి నట సింహం బాలకృష్ణ నటిస్తున్న 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి.

ఈవారం సినిమాలు వాయిదా..?

అక్కినేని నాగచైతన్య నటించిన సాహసం శ్వాసగా సాగిపో చిత్రం ఈనెల 11న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.