తొలిసారి మహేష్ తో....
Send us your feedback to audioarticles@vaarta.com
'శ్రీమంతుడు' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత సూపర్‌స్టార్ మహేష్, సూపర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో మరో ప్రెస్టీజియస్ మూవీ రాబోతోంది. డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బేనర్‌పై సూపర్‌హిట్ చిత్రాల నిర్మాత డి.వి.వి.దానయ్య ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు రవి కె.చంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. తెలుగులో మహేష్ అంటే ఇష్టపడే రవి కె.చంద్రన్ మహేష్‌తో చాలా రోజులుగా కలిసి పనిచేయాలనుకుంటున్నాడట. ఈ సినిమాతో ఆ అవకాశం రావడం పట్ల సోషల్ మీడియాలో రవి.కె.చంద్రన్ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. కొరటాల దర్శకత్వంలో రూపొందిన మిర్చి, శ్రీమంతుడు చిత్రాలకు మది సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేశాడు. జనతాగ్యారేజ్‌కు తిరు కెమెరా వర్క్ చేశాడు. అయితే కొరటాల నాలుగో సినిమాకు రవి.కె.చంద్రన్‌ను తీసుకున్నాడు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com