టీడీపీ చరిత్రలోనే ఇలా జరగడం తొలిసారి!

  • IndiaGlitz, [Thursday,September 26 2019]

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీకి ఊహించని ఫలితాలు రావడంతో.. ఆ దెబ్బ నుంచి కోలుకోకమునుపే వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పార్టీకి ఆర్థికంగా అండగా ఉన్న నేతలు, సిట్టింగ్‌లు, పలువురు మాజీలు టీడీపీకి టాటా చెప్పి వైసీపీ, బీజేపీ తీర్థం పుచ్చుకోవడం.. మరోవైపు పార్టీలో కీలక నేతలు వరుసగా కన్నుమూస్తుండటం లాంటి ఘటనలు టీడీపీకి వరుస ఎదురుదెబ్బల్లా మారుతున్నాయి.

అయితే.. తాజాగా ఢిల్లీ వేదికగా.. టీడీపీ చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో జరగని ఘటన చోటుచేసుకుంది. పార్లమెంట్ ఎన్నికల అనంతరం ఈ టెర్మ్‌కు గాను మొదటిసారిగా వివిధ రాజకీయ పక్షాలకు రూమ్‌లను కేటాయించడం జరిగింది. పార్టీల సభ్యుల సంఖ్య ఆధారంగా 15 రాజకీయ పార్టీలకు పార్లమెంట్‌లో గదులను కేటాయించారు.

ఏ పార్టీకి ఎక్కడ..!?
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ: 2, 3, 4 నంబరు గదులు (గ్రౌండ్ ఫ్లోర్‌)
కాంగ్రెస్ పార్టీ : 24, 25 నంబర్ గదులు
23 ఎంపీ సీట్లను గెలుపొందిన డీఎంకే: 46వ నంబర్ గది
తృణమూల్ కాంగ్రెస్‌ : 20-బి గది
వైసీపీ : రూమ్ నంబర్ 5
టీఆర్ఎస్‌ : మూడో అంతస్తులోని 125వ నంబర్ గది
బీజేపీ మిత్రపక్షమైన శివసేన: మూడో అంతస్తులోని 128వ గది

టీడీపీకి నో రూమ్స్!
అయితే టీడీపీకి మాత్రం కేవలం ముగ్గురు లోక్‌సభ, ఇద్దరు రాజ్యసభ ఎంపీలు ఉండటంతో ఎక్కడా గది కేటాయించలేదు. ఎంపీల సంఖ్య ఆధారంగా పార్టీ ఆఫీసులను కేటాయిస్తారన్న విషయం తెలిసిందే. అయితే ఐదుగురు కంటే తక్కువ మంది ఉన్నా.. ఐదు మంది ఉన్నా పార్లమెంటరీ పార్టీలకు ఆఫీసులను కేటాయించడానికి వీల్లేదు. అందుకే కేంద్రంలో ఉన్న అధికార పార్టీ బీజేపీ.. టీడీపీకీ ఈ అవకాశం ఇవ్వలేదు. అయితే టీడీపీ చరిత్రలో ఇలా జరగడం ఫస్ట్ టైమ్. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇప్పుడు వైసీపీకి ఏ గది అయితే కేటాయించారో.. అదే గదిని 2014-19 మధ్యలో టీడీపీకీ కేటాయించారు. అయితే 2019 ఎన్నికల్లో బొమ్మ తిరగబడటం.. అంటే వైసీపీకి 22 ఎంపీ స్థానాలు.. టీడీపీకి కేవలం 03 స్థానాలు రావడంతో సీన్ రివర్స్ అయ్యింది.

రియాక్షన్ ఉంటుందా..?
మరి.. రేపొద్దున టీడీపీలో ఉన్న కాస్త కూస్తో ఎంపీలు ఏదైనా విషయంపై చర్చించాలంటే ఎక్కడ చర్చిస్తారు..? అనేది ప్రశ్నార్థకమే. మరి ఈ ఎంపీలు ఈ వ్యవహారంపై ఎలా రియాక్ట్ అవుతారో..?.. మరీ ముఖ్యంగా టీడీపీకి జరిగిన అవమానకర పరిస్థితిపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు, తెలుగు తమ్ముళ్లు ఎలా రియాక్ట్ అవుతారో..? వేచి చూడాల్సిందే మరి.

More News

పూజా భారీగా పారితోషికం పెంచేసిందిగా!

టాలీవుడ్‌లో ప్రస్తుతం టాప్ హీరోయిన్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు పూజా హెగ్దే. అప్పుడెప్పుడో ‘ముకుంద’ సినిమాలో నటించిన పూజ..

మాట నిల‌బెట్టుకున్న స‌ల్మాన్‌

బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్ ఖాన్ ప్ర‌స్తుతం ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వంలో `ద‌బంగ్ 3` సినిమాను చేస్తున్నాడు.

క‌మ‌ల్‌హాస‌న్‌పై ఫిర్యాదు చేసిన నిర్మాత‌

విల‌క్ష‌ణ న‌టుడు, నిర్మాత క‌మ‌ల్‌హాస‌న్‌పై ప్రముఖ నిర్మాత‌, స్టూడియో గ్రీన్ అధినేత జ్ఞాన‌వేల్ రాజా ఫిర్యాదు చేశారు.

‘వైఎస్‌’ను గుర్తు చేస్తాడనుకుంటే జగన్ మాత్రం..!

‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనను గుర్తు చేస్తాడనుకుంటే..

కోట్లిస్తానన్నా బాబుకు ‘పీకే’ షాక్.. జగన్‌కే ‘జై’!!

టీడీపీ అధినేత చంద్రబాబుకు ‘పీకే’ మరోసారి షాకిచ్చారా..? కుదరదంటే కుదరదు.. అస్సలు కుదరదని తేల్చిచెప్పేశారా..?