ప్రభాస్ కెరీర్‌లో తొలిసారి
- IndiaGlitz, [Tuesday,December 03 2019]
'బాహుబలి'తో నేషనల్ స్టార్‌గా ఎదిగిన యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ తర్వాత 'సాహో' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం ప్యాన్ ఇండియా చిత్రంగానే విడుదలైనప్పటికీ బాహుబలిలా ప్రేక్షకులను అన్ని భాషల్లో ఆకట్టుకోలేదు. అయితే ప్రభాస్ ఇప్పుడు చేస్తోన్న తాజా చిత్రాన్ని కూడా ప్యాన్ ఇండియా చిత్రంగానే విడుదల చేయాలని అనుకుంటున్నాడట. అందుకు తగినట్లుగానే సినిమా రూపొందుతోంది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదల కానుంది.
1960-70 బ్యాక్‌డ్రాప్‌తో లింక్ అవుతూ నేటి కాలానికి కొనసాగే ప్రేమకథాశంతో ఈ సినిమా ఉంటుందట. పూర్వజన్మలో ధనవంతుడిగా ప్రభాస్, పేద అమ్మాయిగా పూజా హెగ్డే పుడుతుందట. ఆ సమయంలో విఫలమైన వారి ప్రేమ ఇప్పటి కాలంలో ఎలా కలిసిందనేదే కథట. ప్రభాస్ ఇందులో హస్తసాముద్రిక తెలిసిన వ్యక్తిగా కనపడబోతున్నాడట. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరణను జరుపుకుంటుంది. ఈ చిత్రానికి 'జాన్' అనే టైటిల్ పరిశీలనలో ఉందని వార్తలు వినపడుతున్నాయి. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.