ఎన్టీఆర్ కెరీర్‌లోనే తొలిసారిగా..

  • IndiaGlitz, [Tuesday,May 22 2018]

2001లో విడుద‌లైన‌ ‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అనంతరం ‘స్టూడెంట్ నెం.1’, ‘ఆది’, ‘సింహాద్రి’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.. స్టార్ హీరోగా కూడా ఎదిగారు. ఇదిలా ఉంటే.. ఇంతవరకు ఆయన 27 సినిమాల్లో నటించగా.. ఆయా సినిమాల టైటిల్స్ అన్నీ కూడా ఎన్టీఆర్ నటించిన పాత్ర పేరుతోనో.. లేదా ఆ పాత్రకి ఉన్న ప్రాముఖ్యత పేరుతోనో తెరకెక్కినవే. అయితే తొలిసారి ఈ సంప్రదాయానికి కొంత గ్యాప్ ఇచ్చి.. ఆయ‌న 28వ చిత్రానికి హీరోయిన్ క్యారెక్టర్ పేరుతో టైటిల్‌ని ఫిక్స్ చేసారు.

ఆ వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అరవింద సమేత వీర రాఘవ’. ఈ టైటిల్ చూస్తుంటే.. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న పూజా హెగ్డే పాత్ర‌ పేరు అరవింద అని ఇట్టే అర్థ‌మైపోతోంది. మరి ఇంతవరకు గ్లామర్ పాత్రలతో మెప్పించిన పూజా హెగ్డే.. తొలిసారిగా చేస్తున్న టైటిల్ పాత్ర‌కి న్యాయం చేసి మెప్పిస్తుందా? ఎన్టీఆర్, త్రివిక్రమ్ ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుందా? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. ద‌స‌రా కానుకగా ఈ సినిమా తెరపైకి రానుంది.

More News

అక్క‌డ హ‌వా కొన‌సాగిస్తున్న మిక్కీ

క్లాస్‌ సినిమాలకి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న యువ సంగీత దర్శకుడు మిక్కీ జె. మేయర్. ఇప్పటివరకు ఈ స్వరకర్త కెరీర్‌ను పరిశీలిస్తే.. తన క్లాస్ అండ్ మెలోడీ మ్యూజిక్‌

మ‌హాన‌టి నిర్మాత‌ల‌తో ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ చేయ‌నున్న విజ‌య్‌..

‘అర్జున్ రెడ్డి’ విజయం తర్వాత చేతినిండా సినిమాలతో బిజీగా మారిన నటుడు యూత్ స్టార్ విజయ్ దేవరకొండ.

జూన్‌ 1న విశాల్‌ 'అభిమన్యుడు'

మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడిగా విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో తమిళ్‌లో రూపొందిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ఇరుంబుతెరై'.

'ప్రేమకథా చిత్రమ్' మ్యాజిక్ రిపీట్ అవుద్దా?

‘ఎస్‌.ఎం.ఎస్‌’ ( శివ మనసులో శృతి) చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన క‌థానాయ‌కుడు సుధీర్ బాబు. ఆ త‌రువాత‌ 'ప్రేమకథా చిత్రమ్', 'ఆడు మగాడ్రా బుజ్జి', 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని', 'మోసగాళ్ళకు మోసగాడు'.

ఫ్యాక్షన్ లీడర్‌గా ఎన్టీఆర్?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఉత్తరాది భామ పూజా హెగ్డే జంటగా ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో