కేసీఆర్ లైఫ్‌లో ఫస్ట్ టైమ్ ఇలా..!?

  • IndiaGlitz, [Saturday,March 30 2019]

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా సాయంత్రం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభకు జనాలు రాకపోవడం సడన్‌గా రద్దు అయ్యింది. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5.30 గంటలకు సమావేశం ప్రారంభం కావాల్సి ఉంది.. అయితే రాత్రి ఏడు దాటినప్పటికీ సభా ప్రాంగణంలో జనాలు లేకపోవడంతో బహిరంగ సభను వాయిదా వేస్తున్నట్లు పార్టీ శ్రేణులు ప్రకటించాయి. కాగా ఈ సభకు సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల నియోజకవర్గాల నుంచి భారీగా టీఆర్ఎస్ కార్యకర్తలు తరలివస్తారని అందరూ భావించారు. సుమారు 40వేలకు పై చిలుకు జనాలు వస్తారని గులాబీ నేతలు ఊహించారు. అయితే సభా ప్రాంగణం మొత్తమ్మీద వందల సంఖ్యలో కూడా జనాలు లేకపోవడంతో మార్గ మధ్యలోనే కేసీఆర్ సభను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాలని గులాబీ నేతలను ఆదేశించారట.

కాగా.. కేసీఆర్ ఎన్నికల ప్రచార సభల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఏ రేంజ్‌‌లో జనం వచ్చారో కొత్తగా చెప్పనక్కర్లేదు. అయితే పార్లమెంట్ ఎన్నికల విషయానికొచ్చేసరికి ఇలా ఎందుకు జరుగుతోందో గులాబీ నేతలకు సైతం అర్థం కాని పరిస్థితి. శుక్రవారం జరిగిన ఈ ఘటనతో గులాబీ శ్రేణులు షాక్‌‌కు గురయ్యాయి.

కన్నెర్రజేసిన కేసీఆర్!?

ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గానికి గాను ఒక్కో మంత్రిని ఇన్‌ఛార్జీగా కేసీఆర్ నియమించడం జరిగింది. ఆ నియోజకవర్గంలో మొత్తం కార్యక్రమాలు మొదలుకుని గెలిపించుకురావాల్సిన భాద్యతను ఆ ఇంచార్జ్‌కు అధిష్టానం అప్పగించింది. అయితే శుక్రవారం ఎల్భీ స్టేడియానికి జనసమీకరణ ఎందుకు చేయలేకపోయారు..? ఎవరు ఫెయిల్ అయ్యారు..? అసలేం జరుగుతోంది అని ఆరా తీసిన కేసీఆర్.. పలువురు నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఎన్నికల ముందు ఇలా ప్రత్యర్థులకు మనం ఇలాంటి అవకాశాలివ్వొచ్చా..? మరోసారి ఇలాంటివి రిపీట్ అయితే మాత్రమే ఊరుకునే ప్రసక్తే లేదని.. అదే స్టేడియంలో మరో రోజు సభకు ఏర్పాటు చేయాల్సిందిగా పార్టీ నేతలకు కేసీఆర్ సూచించారని సమాచారం.

బహుశా కేసీఆర్ లైఫ్‌‌లో ఫస్ట్ టైమ్ ఇలా జరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే పార్టీ శ్రేణులు మాత్రం మిర్యాలగూడ నుంచి హైదరాబాద్‌కు వచ్చేకి లేట్ అయ్యిందని అందుకే ఉన్నపాటుగా కేసీఆర్ సభకు హాజరు కాలేకపోయారని చెబుతున్నాయి. కారణాలు ఎన్ని ఉన్నప్పటికీ అసలే అసెంబ్లీ ఎన్నికల్లో అంతంత మాత్రమే గెలుచుకున్న కాంగ్రెస్‌.. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సిటీలో గెలిచి చూపించాలని భావిస్తోంది.. అయితే ఈ తరుణంలో ఇలా జరగడం ప్రత్యర్థి పార్టీ సువర్ణావకాశం ఇచ్చినట్లైందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై త్వరలో జరగనున్న సభల్లో కేసీఆర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే మరి.

More News

బాబుకు ఊహించని షాకిచ్చిన ఈసీ ..ఈ దెబ్బతో..!

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుకు వరుస షాక్‌‌లు ఎక్కువయ్యాయి.

వైరల్ న్యూస్: గొడుగుతో పాటు గాల్లోకి ఎగిరిపోయాడు!

గొడుగుతో పాటు గాల్లోకి ఎగిరిపోవడమేంటి..? అని కాసింత ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదూ.. కాస్త ఈ విషయంపై క్లారిటీ వస్తే నిజమా..?

వైఎస్‌ కుటుంబానిది అలాంటి సంస్కృతి కాదు!

రాబోయే ఎన్నికల్లో విలువలు, విశ్వసనీయతకు పట్టం కట్టాలని వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ విజ్ఞప్తి చేశారు.

అవినీతిలేని రాజకీయ వ్యవస్థ కోసం జనసేనను గెలిపించండి

ఆదోని నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో రాష్ట్రంలో ఎక్కడా క‌న‌బ‌డ‌ని ఓ చిత్రమైన‌ రాజ‌కీయ ప‌రిస్థితులు క‌న‌బ‌డ‌తాయని, రాజ‌కీయ ప్రత్యర్ధులు కేవలం రాజ‌కీయాల‌కి మాత్రమే ప్రత్యర్ధులని,

ఉచిత విద్య, వైద్యం అందిస్తాం: పవన్

జ‌న‌సేన ప్రభుత్వం ఏర్పడిన త‌ర్వాత నంద్యాల పార్లమెంటుని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేస్తామ‌ని జ‌న‌సేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.