దేశంలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు.. తొలిసారిగా..
Send us your feedback to audioarticles@vaarta.com
భారత్‌లో నిన్న కరోనా మరింత తీవ్ర స్థాయిలో విజృంభించింది. ఇప్పటి వరకూ ఎన్నడూ లేనంతగా రికార్డ్ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. తాజాగా హెల్త్ బులిటెన్‌ను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 11.70 లక్షల శాంపిళ్లను పరీక్షించగా... 83,029 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వైరస్ దేశంలోకి ప్రవేశించిన అనంతరం దేశంలో ఒకే రోజు ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. అంతేకాకుండా ఒక్కరోజు వ్యవధిలో ఇంత పెద్ద మొత్తంలో కేసులు నమోదవడం ప్రపంచంలోని భారత్‌లో తప్ప మరే దేశంలోనూ జరగలేదు.
కాగా.. దేశంలో ఇప్పటి వరకూ కేసుల సంఖ్య 38,53,407కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 1043 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 67,376కు చేరుకుంది. కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 29,70,493 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 8,15,538 యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 77 శాతం ఉండగా.. కరోనా మరణాల రేటు 1.7 శాతంగా ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout