ఏపీలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు.. రాష్ట్రంలోనే తొలిసారిగా..

  • IndiaGlitz, [Friday,July 24 2020]

ఏపీలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. నేడు మరణాల సంఖ్య తగ్గడం కాస్త ఊరటనిస్తోంది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం నాటి కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 48,114 శాంపిళ్లను పరీక్షించగా.. 8147 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 80,858కి చేరుకుంది. కాగా రాష్ట్రంలో 39990 యాక్టివ్ కేసులున్నాయి. 39935 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

కాగా నేడు ఒక్కరోజే రాష్ట్రంలో 49 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకూ మొత్తం మృతుల సంఖ్య 933కు చేరుకుంది. అయితే కరోనాతో నేడు తూర్పుగోదావరిలో 11 మంది, కృష్ణలో తొమ్మిది మంది, కర్నూలులో 8 మంది, శ్రీకాకుళంలో ఏడుగురు, చిత్తూరులో ఒక్కరు, ప్రకాశంలో ఒక్కరు, విజయనగరంలో ఒక్కరు మరణించారు. రాష్ట్రం మొత్తం మీద అత్యధికంగా తూర్పుగోదావరిలో 1000కి పైగా కేసులు నమోదయ్యాయి. నేడు ఒక్కరోజే తూర్పు గోదావరిలో 1029 కేసులు నమోదవడం గమనార్హం. కాగా ఇప్పటి వరకూ రాష్ట్రంలో 15 లక్షల 41,993 శాంపిళ్లను పరీక్షించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

More News

అదే జరిగితే.. రాష్ట్రం రావణకాష్టం అవుతుంది: పవన్

ప్రజలు ఎదురు తిరగట్లేదు.. ఏమీ మాట్లాడట్లేదు అనుకోవడం పొరపాటేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

రానా వెడ్డింగ్ ఇన్విటేష‌న్‌(ఫ్యాన్ మేడ్)... వేదిక మార‌నుందా?

సినీ ప‌రిశ్ర‌మ‌లో ద‌గ్గుబాటి వారికి ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. వీరి మూడోత‌రంగా సినీ రంగంలో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్నాడు రానా ద‌గ్గుబాటి.

మ‌హేశ్‌కు భారీ ఆఫ‌ర్‌....?

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ లాక్‌డౌన్ స‌మ‌యంలో పిల్ల‌ల‌తో స‌ర‌దాగా స‌మ‌యాన్ని గ‌డుప‌తున్నారు. క‌రోనా ప్ర‌భావం లేకుండా ఉండుంటే ఈపాటికే ఆయ‌న 27వ చిత్రం ‘సర్కారు వారి పాట’ సినిమా సెట్స్‌పై ఉండేది.

ప్రియాంక స్థానం కాజ‌ల్ అగ‌ర్వాల్‌..?

ద‌శాబ్దం కాలం ముందు తెలుగు ప్రేక్ష‌కుల‌ను హీరోయిన్‌గా ప‌ల‌క‌రించింది కాజ‌ల్ అగ‌ర్వాల్‌. చంద‌మామ‌లాంటి అమ్మ‌డు న‌చ్చ‌డంతో ఈమెకు తెలుగులో అవ‌కాశాలు క్యూ క‌ట్టాయి.

చీటింగ్ కేసులో హీరో సూర్య బంధువు.. నిర్మాత జ్ఞాన‌వేల్‌కు కోర్టు స‌మ‌న్లు

తమిళ నిర్మాత జ్ఞాన‌వేల్ రాజాకు మ‌నీ లాండ‌రింగ్ కేసుకు సంబంధించి రామ‌నాథ పురం పోలీస్ స్టేస‌న్‌లో హాజ‌రై వివ‌ర‌ణ ఇవ్వాలంటూ మద్రాస్ హైకోర్టు స‌మ‌న్లు జారీ చేసింది.