ద్విభాషా చిత్రంలో తొలిసారి....

  • IndiaGlitz, [Thursday,June 29 2017]

కన్నడలో 'అధ్యక్షా' చిత్రంతో పరిచయమైన హెబా పటేల్‌ ఆ తర్వాత ఓ తమిళ సినిమా కూడా చేసింది. అయితే ఈ సినిమాలు ఆమె కెరీర్‌కి ఎంత మాత్రం ఉపయోగ పడలేదు. తెలుగులో 'అలా ఎలా' చిత్రంఓ పరిచయమై 'కుమారి 21ఎఫ్‌' చిత్రంతో అందర్నీ ఆకట్టుకుంది. ముఖ్యంగా యూత్‌లో హెబాకు మంచి ఫాలోయింగ్‌ వుంది.

'ఈడోరకం ఆడోరకం', 'ఎక్కడికి పోతావు చిన్నవాడ', 'నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్‌' వంటి సూపర్‌హిట్‌ సినిమాలు చేసింది. తాజాగా రాజ్‌తరుణ్‌తో చేసిన 'అంధగాడ' కూడా మంచి విజయాన్ని సాధించింది. కన్నడ, తమిళ చిత్రాల్లో రాని గుర్తింపు తెలుగులో వచ్చింది. ఇప్పుడు హెబా తమిళ్‌లో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. జాతీయ స్థాయిలో అవార్డు గెలుచుకున్న 'మిణుగురులు' చిత్ర దర్శకుడు హెబా పటేల్‌ ప్రధాన పాత్రలో తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రాన్ని రూపొందించనున్నారు. త్వరలోనే సెట్స్‌ పైకి వెళ్ళనున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి.

More News

33 ఏళ్ల సినీ ప్రస్థానంలో దర్శకుడు శ్రీనివాస రెడ్డి

కామెడీ చిత్రాల దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ దర్శకుడు ఎస్.శ్రీనివాస రెడ్డి

పృథ్వీకి కోర్టులో చుక్కెదురు...

థర్టీ ఇయర్ ఇండస్ట్రీ ఇక్కడ అంటూ చిన్న చిన్న వేషాలు వేసిన కమెడియన్ పృథ్వీ ఇప్పుడు వన్ ఆఫ్ ది లీడింగ్ కమెడియన్గా మారారు. వ్యక్తిగత విషయానికి వస్తే పృథ్వీ తన భార్య శ్రీలక్ష్మితో వచ్చిన విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నాడు.

ఒకపాట మినహా చిత్రీకరణ పూర్తి చేసుకొన్న మంచు విష్ణు 'ఓటర్'

మంచు విష్ణు-సురభి జంటగా జి.ఎస్.కార్తీక్ దర్శకత్వంలో రూపొందుతున్న తెలుగు-తమిళ బైలింగువల్ "ఓటర్". "హీరో ఆఫ్ ది నేషన్" అనేది ట్యాగ్ లైన్. రామా రీల్స్ పతాకంపై సుధీర్ కుమార్ పూదోట (జాన్) నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

జూలై 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్న 'రెండు రెళ్ళు ఆరు'

అనిల్ మల్లెల, మహిమా హీరోహీరోయిన్లుగా నందు మల్లెల దర్శకత్వంలో సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రం, డే డ్రీమ్స్ బ్యానర్స్ పతాకంపై ప్రదీప్చంద్ర, మోహన్ అండె సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'రెండు రెళ్ళు ఆరు'.

గల్ఫ్ కథానాయకుని ప్రచార చిత్రం ఆవిష్కరించిన నేచురల్ స్టార్ నాని

శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో చేతన్ మద్దినేని హీరోగా,