గాయత్రి కోసం తొలిసారిగా..
Send us your feedback to audioarticles@vaarta.com
పదహారేళ్లుగా కథానాయికగా రాణిస్తోంది ఢిల్లీ డాళ్ శ్రియా శరన్. గతేడాది గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంలో వశిష్ఠీ దేవిగా అలరించిన శ్రియ.. ఆ తరువాత పైసా వసూల్ చిత్రంలో సందడి చేసింది. ఇక ఈ ఏడాదిలో తొలిగా గాయత్రి చిత్రంతో సందడి చేయనుంది. మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో మంచు విష్ణుకి జోడీగా శ్రియ నటించిన సంగతి తెలిసిందే.
గతంలో వీరిద్దరి కాంబినేషన్లో గేమ్ చిత్రం వచ్చింది. ఆ సినిమా పతాక సన్నివేశాల్లో విష్ణుతో సందడి చేసిన శ్రియ.. ఈ చిత్రంలోనూ 15 నిమిషాల పాటు సాగే పాత్రలో అతనితో కలిసి నటించింది. యాక్టింగ్ స్కోప్ ఉన్న ఈ పాత్రలో శ్రియని తప్ప మరెవరినీ ఊహించుకోలేమంటూ ఇప్పటికే మోహన్ బాబు, విష్ణు చెప్పడంతో.. ఆ పాత్రకి ఉన్న ప్రాధాన్యత ఏమిటో చెప్పకనే చెప్పినట్లయ్యింది.
కాగా, ఇందులో శ్రియ చేస్తున్న పాత్ర పేరు శారద అని తెలిసింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. పదహారేళ్ళ కెరీర్లో ఈ పేరు గల పాత్రలో శ్రియ నటించడం ఇదే తొలిసారి కావడం. మరి గాయత్రిలో చేసిన శారద పాత్ర శ్రియకి నటిగా మరింత గుర్తింపు తీసుకువస్తుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com