ఇండియాలో ఫస్ట్ టైమ్ కోవిడ్-19 మైక్రోస్కోపీ చిత్రం
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. అక్కడెక్కడో చైనాలోని వూహాన్‌లో పుట్టిన ఈ వైరస్ ప్రపంచాన్ని గడగడ లాడిస్తోంది. మరోవైపు చైనా, అమెరికా, ఇటలీ లాంటి దేశాల్లో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెద్ద ఎత్తున పెరిగిపోతుండటంతో పాటు మరణాల సంఖ్య కూడా భారీగానే ఉంది. చిన్న-పెద్దా, పేద-ధనిక అనే తేడా లేకుండా కరోనా కాటేస్తోంది. మరోవైపు మన భారతదేశంలోనూ కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అయితే.. ఇంతవరకూ దీనికి ఎలాంటి మెడిసిన్ లేకపోవడంతో ప్రజలు మరింత భయంతో వణికిపోతున్నారు.
అయితే.. అసలు కరోనా వైరస్ మానవుడిలోకి ప్రవేశించిన తర్వాత ఎలా ఉంటుంది..? మానవుడు ఎలా ఉంటాడు..? అనేదానిపై ఇండియాలో ఫస్ట్ టైం ఓ మైక్రోస్కోపీ చిత్రాన్ని విడుదల చేయడం జరిగింది. మొదట.. భారతీయ శాస్త్రవేత్తలు SARS-CoV-2 వైరస్ (COVID19) యొక్క మైక్రోస్కోపీ చిత్రాన్ని వెల్లడించారు. భారతదేశంలో మొట్టమొదటి ప్రయోగశాల ధృవీకరించిన COVID19 కేసు నుంచి గొంతు శుభ్రముపరచు నమూనాను శాస్త్రవేత్తలు తీసుకున్నారు. కేరళలో జనవరి 30న ఈ కేసు నమోదవ్వగా.. రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ ఫలితాలను తాజాగా.. ఐజెఎంఆర్ యొక్క తాజా ఎడిషన్‌లో ప్రచురించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout