కోడికత్తి కేసులో వైసీపీ మొదటి విజయం!

  • IndiaGlitz, [Wednesday,January 09 2019]

వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో వైసీపీ మొదటి విజయం సాధించింది. ఈ దాడి జరిగినప్పట్నుంచి వైసీపీ చేస్తున్న డిమాండ్లకు ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం స్పందించి ఎన్ఐఏకు కేసును బదిలీ చేసింది. అంతటితో ఆగని వైసీపీ నేతలు కోడికత్తి కేసులోని నిందితుడైన శ్రీనివాసరావును కస్టడీలోకి తీసుకుంటే విచారిస్తే నిజానిజాలు నిగ్గుతేలుతాయని డిమాండ్ చేసింది. దీంతో కేసును తీసుకున్న తర్వాత మొదట విజయవాడకు కేసును బదిలి చేయాలని అధికారులు కోర్టును ఆశ్రయించారు.

మంగళవారం రోజున అనుకున్నట్లుగానే ఎన్‌‌ఐఏ అధికారులు డిమాండ్ మేరకు విజయవాడకు కేసును బదిలీ చేయడం జరిగింది. కాగా ఎక్కువశాతం ఎన్ఐఏ కేసులు మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టుల్లోనే విచారణ జరుగుతాయి. ఇందులో భాగంగానే తాజాగా ఈ కేసును విజయవాడ తరలించమని అడిగామని అధికారులు చెబుతున్నారు. అయితే మరోవైపు నిందితుడు శ్రీనివాసరావును కూడా కస్టడీకి ఇవ్వాలని కోరడంతో అతడ్ని త్వరలోనే రాజమండ్రి జైలుకు తరలించేందుకు యోచిస్తునట్లు తెలుస్తోంది. కాగా ఈ వ్యవహారంపై స్పష్టత రాలేదు. నిందితుడ్ని తరలించిన తర్వాత సుధీర్ఘంగా తమదైన శైలి అధికారులు విచారించి నిజానిజాలు నిగ్గు తేల్చడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

కాగా.. ఈ కేసును మొదట్నుంచి టీడీపీ అధినేత మొదలుకుని చిన్నపాటి నేతల వరకు చిల్లీగా తీసిపడేసిన సంగతి తెలిసిందే. కేసులో కొత్తసీసాలో పాత సారా లాగా ఇటీవల చెప్పిందే మళ్లీ మళ్లీ మీడియా ముందుకొచ్చి అటు నేతలు... ఇటు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారంటూ వైసీపీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. అయితే ఎప్పుడైతే ఎన్ఐఏ వచ్చిందో అప్పట్నుంచి పరిణామాలు ఒక్కొక్కటిగా మారిపోతున్నాయి. అయితే జగన్‌పై దాడి కేసును ఎన్ఐఏకు అప్పగించడాన్ని మొదట్నుంచి వ్యతిరేకిస్తున్న ఏపీ సర్కార్ త్వరలోనే కేంద్ర హోం శాఖకు లేఖ రాయాలని నిర్ణయించింది. అయితే లేఖరాస్తే కేంద్రం నుంచి ఎలాంటి స్పందన వస్తుంది..? ఈ కేసులో ఎన్ఐఏ అధికారులు ఏం తేల్చబోతున్నారో తెలియాలంటే మరికొద్దిరోజులు వేచి చూడాల్సిందే మరి.

More News

ఇది మార్పుకు సూచకమే..: పవన్

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు తక్కువ సమయం ఉండటంతో ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్ని జిల్లాల నేతలు, కార్యకర్తలు, అభిమానులు, విద్యార్థులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.

మోదీ ఎలక్షన్ ప్లాన్ సక్సెస్.. ఈబీసీ బిల్లు పాస్

ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ముందు వేసిన పాచిక ఫలించింది. అగ్రవర్ణాల్లో పేదలకు పది శాతం రిజర్వేషన్ల పెంచాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం సక్సెస్ అయ్యింది.

బాంబులేసినా చ‌లించ‌నంత బ‌లం నా దగ్గరుంది: పవన్

తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా సరే ఫలానా సమస్య ఉందని జనసేనను సంప్రదిస్తే చాలు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తనవంతుగా పరిష్కార మార్గం చూపేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు.

సైరా రిలీజ్ గురించి చెప్పిన చెర్రీ

చిరంజీవి టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. బ్రిటీష్ వారికి ఎదురు తిరిగిన తొలి స్వాతంత్య్ర యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర

ఈబీసీలకు 10% రిజర్వేషన్లపై చంద్రబాబు స్టాండ్ ఇదీ..

అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగాల్లో పదిశాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రంలోని మోదీ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.