కబాలి ఫస్ట్ రివ్యూ...
Send us your feedback to audioarticles@vaarta.com
కబాలి..కబాలి..కబాలి ఎక్కడ విన్న ఇదే మాట. ఇప్పటి వరకు ఏ సినిమాకి రానంత క్రేజ్ కబాలికి వచ్చింది. ఆకాశమే హద్దుగా అంచనాలను ఏర్పరుచుకున్న కబాలి రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అయితే...కబాలి ప్రీమియర్ షో ఓవర్ సీస్ లో ప్రదర్శించారు కబాలి ఫస్ట్ రివ్యూ అంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
ఇంతకీ కబాలి రివ్యూ ఏం చెబుతుంది అంటే....రజనీ ఫ్యాన్స్ కి కబాలి పైసా వసూల్ మూవీ. కథ గురించి చెప్పాలంటే...మలేషియాలో ఉన్నతమిళియన్స్ ని అక్కడ వారు తక్కువుగా చూస్తుండడంతో ఎన్నో కష్టాలు పడుతుంటారు. వారికి అండగా నిలిచి కబాలి ఎలా డాన్ అయ్యాడు..? మలేషియాలోని తమిళియన్స్ జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకువచ్చాడు అనేది క్లుప్తంగా కబాలి కథ.
రజనీ ఏక్టింగ్ గురించి చెప్పాలంటే...స్లో మోషన్ వాక్, స్టైల్, సుత్తి లేకుండా సూటిగా చెప్పే డైలాగ్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ లో యంగ్ గెటప్ లో కనిపించే రజనీ తెర పైకి రాగానే ఫ్యాన్స్ రజనీకాంత్ కెరీర్ లో మరచిపోలేని గత చిత్రాలను నెమరవేసుకుంటారు. హీరోయిన్ రాధికా ఆప్టే పాత్రకు తగ్గట్టు అద్భుతంగా నటించింది. రజనీ సినిమాల్లోనటిస్తారని ఊహించని ఒకరు ఈ సినిమాలో కనిపిస్తారు. అది ఎవరు అనేది తెర పైనే చూడాలి. డైరెక్టర్ రంజిత్ పట్టుసడలని స్ర్కీన్ ప్లేతో పెంటాస్టిక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అభిమానులుకు కబాలి ఓ పండగ అని రివ్యూ చెబుతుంది. మరి..ఈ రివ్యూ ఎంత వరకు కరెక్టో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com