ఎక్కడికి కావాలంటే అక్కడికి లాక్కెళ్లవచ్చు.. ఏపీలో మొదటి మొబైల్ థియేటర్, ఎక్కడో తెలుసా..?
Send us your feedback to audioarticles@vaarta.com
అలిసిన మనసుకు ఒత్తిడిని దూరం చేసి.. మూడు గంటల పాటు మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిది సినిమా. ఆధునిక కాలంలో వినోదానికి అసలు సిసిలు చిరునామా సినిమానే. దేశభక్తిని పెంపొందిస్తూ.. జాతీయ సమైక్యతను నిలిపివుంచే సాధనాలలో సినిమా కూడా ఒకటి. చిన్నారుల నుంచి పెద్దల వరకు థియేటర్‌కి సినిమా చూడని వారుండరు. కాలేజీలకు బంకు కొట్టి సినిమాలకు వెళ్లన యువకుడు లేడంటే అతిశయోక్తి కాదు. అలా భారతీయుల రోజు వారి జీవితంలో సినిమా ఒక భాగమైంది.
మారుతున్న కాలమాన పరిస్ధితులకు అనుగుణంగా సినిమా థియేటర్ కూడా మారిపోయింది. బ్లాక్ అండ్ వైట్, కలర్, సినిమా స్కోప్, 70 ఎంఎం, ఎల్‌ఈడీ, ఎల్‌సీడీ, డీటీఎస్, క్యూబ్ ఇలా రకరకాలుగా రూపాంతరం చెందింది. ఈ కోవలోనే మొబైల్ థియేటర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. దేశంలో మొట్టమొదట 1930లో ‘కోహినూర్ ఒపేరా’ పేరుతో అస్సాంలో మొబైల్ థియేటర్ ను ప్రారంభించారు. దీనిని నాట్యాచార్య బ్రజనాథ్ శర్మ 90 ఏండ్ల కిందనే స్థాపించారు. దీని ద్వారా వేలాది మంది ప్రేక్షకులను ఆకర్షించి నాటకాలను ప్రదర్శించేవారు.
ప్రస్తుతం, ఆంధ్రప్రదేశ్‌లోనూ మొదటి మొబైల్ సినిమా ధియేటర్ రూపుదిద్దుకుంటోంది. దీనిని ట్రక్కు ద్వారా ఎక్కడికైనా తీసుకుపోయి అమర్చుకోవచ్చు . ఏపీలో రాజానగరం వద్ద నేషనల్ హైవే పక్కన హాబిటేట్ ఫుడ్ కోర్టు ప్రాంగణంలో ఈ ధియేటర్ ఏర్పాటౌతోంది. వెదర్ ప్రూఫ్, ఫైర్ ఫ్రూఫ్ పద్ధతుల్లో వేసిన టెంట్‌లో గాలినింపే టెక్నాలజీతో 120 సీట్ల కెపాసిటీతో ఈ ఏసీ థియేటర్‌ను ఏర్పాటు చేశారు. ‘పిక్చర్ డిజిటల్స్’ సంస్ధ ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పుతున్న మొబైల్ ధియేటర్లలో ఇది మొదటిది. ఇది ఒకప్పటి టూరింగ్ టాకీసులకు ఆధునికమైన, సౌకర్యవంతమైన రూపం. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ సినిమాతోనే మొదటి ప్రదర్శన ప్రారంభమవుతుందని సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments