'నాన్నకు ప్రేమతో..'ఫస్ట్ లుక్ విడుదల...
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్‌టైగర్ ఎన్టీఆర్, ఆర్య సుకుమార్ కాంబినేషన్‌లో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాతగా, భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ కోప్రొడ్యూసర్స్‌గా రూపొందుతున్న భారీ చిత్రానికి 'నాన్నకు ప్రేమతో..' టైటిల్ కన్‌ఫర్మ్ చేశారు. హీరో యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ప్రేక్షకులకు, అభిమానులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని ట్విట్టర్‌లో రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా...
దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ - ''గెటప్‌లోనూ, క్యారెక్టరైజేషన్‌లోనూ, కథలోనూ, స్క్రీన్‌ప్లేలోనూ అన్ని విధాలా కొత్తగా వుండే ఈ 'నాన్నకు ప్రేమతో..'లో ఓ కొత్త ఎన్టీఆర్‌ని చూస్తారు. ఎన్టీఆర్ ఇమేజ్‌కి తగినట్టుగా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ వుంటూనే సినిమా కొత్త స్టైల్‌లో చాలా ఇంట్రెస్టింగ్‌గా వుంటుంది. ఎన్టీఆర్‌తో ఫస్ట్ టైమ్ చేస్తున్న 'నాన్నకు ప్రేమతో..' నా కెరీర్‌లోనూ, ఎన్టీఆర్ కెరీర్‌లోనూ చాలా మంచి సినిమా అవుతుంది'' అన్నారు.
నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ - ''80 రోజులపాటు లండన్‌లో తొలి షెడ్యూల్ చేస్తున్నాం. ఈ నెల 24తో లండన్ షెడ్యూల్ ఫినిష్ అవుతుంది. ఈ షెడ్యూల్‌లోనే పీటర్ హెయిన్స్ సారధ్యంలో మూడు థ్రిల్లింగ్ ఫైట్స్, రాజుసుందరం, శేఖర్ మాస్టర్‌ల సారధ్యంలో రెండు పాటలు, వాటితోపాటు చిత్రంలోని ప్రధాన తారాగణం పాల్గొన్న ఇంపార్టెంట్ సీన్స్ చిత్రీరించాం ఏకధాటిగా 80 రోజులపాటు లండన్‌లో చేస్తున్న ఈ షెడ్యూల్‌తో మేజర్ వర్క్ ఫినిష్ అవుతుంది. అక్టోబర్‌లో 20 రోజులపాటు స్పెయిన్‌లో చేసే షెడ్యూల్‌తో సినిమా కంప్లీట్ అవుతుంది. వినాయకచవితికి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాం. ఫస్ట్ లుక్‌కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.
వరల్డ్‌వైడ్‌గా ట్రెండింగ్‌లో వుంది. విజయదశమికి ఫస్ట్ టీజర్ రిలీజ్ చేస్తాం. వరల్డ్‌వైడ్‌గా జనవరి 8న సంక్రాంతి కానుకగా 'నాన్నకు ప్రేమతో.' చిత్రాన్ని చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తాం. ఎన్టీఆర్, సుకుమార్ గార్ల కాంబినేషన్‌లో మా బేనర్‌కి ఇది మరో ప్రెస్టీజియస్ మూవీ అవుతుంది. ఎన్టీఆర్ పెర్‌ఫార్మెన్స్, సుకుమార్ టేకింగ్, దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్, పీటర్ యాక్షన్ అన్నీ ఈ సినిమాని చాలా పెద్ద రేంజ్‌కి తీసుకెళ్తాయి. అత్తారింటికి దారేది తర్వాత మళ్ళీ మా బేనర్‌లో వస్తోన్న మరో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. ప్రేక్షకులకు ఈ సినిమా అన్నివిధాలా థ్రిల్‌ని ఇస్తుంది. ఎన్టీఆర్ అభిమానుల్ని ఆకట్టుకునే అన్ని అంశాలూ ఇందులో వుంటాయి'' అన్నారు.
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ భారీ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్, సితార, అమిత్, తాగుబోతు రమేష్, గిరి, నవీన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఫోటోగ్రఫీ: విజయ్ చక్రవర్తి, ఆర్ట్: రవీందర్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఎడిటింగ్: నవీన్ నూలి, పాటలు: చంద్రబోస్, డాన్స్: రాజు సుందరం, శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుధీర్, కోప్రొడ్యూసర్స్: భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com