మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' ఫస్ట్ లుక్ మరియు 'టీజర్'
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి 60 వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ చిత్రానికి సంభందించిన మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు నిర్మాత దానయ్య డి.వి.వి. అలాగే ఈ రోజు రాత్రి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల సమక్షంలో చిత్రం 'టీజర్' ను కూడా విడుదల చేయ నున్నట్లు తెలిపారు.
'మెగాస్టార్ చిరంజీవి' స్పెషల్ అప్పియరెన్స్ :
'నిజమే.. ఎంతో ఎగ్జయిటింగ్ గా ఉంది'. మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రం లో నటించే విషయం పై దర్శకుడు శ్రీను వైట్ల మాట్లాడుతూ పై విధంగా అన్నారు. చిరంజీవిగారు ఎంతో ఎనర్జిటిక్ గా, మరింత గ్లామరస్ గా ఉన్నారు. ఆయన నటించే సన్నివేశాలను త్వరలో చిత్రీకరించ బోతున్నాము. ఆ క్షణాల కోసం ఎదురు చూస్తున్నాను. ఖచ్చితంగా ఓ మాట మాత్రం చెప్పగలను. అభిమానుల ఆనందం అంబరాన్ని తాకేలా మెగాస్టార్ చిరంజీవి గారు కనిపించే సన్నివేశాలు తెరకెక్క బోతున్నాయని తెలిపారు దర్శకుడు శ్రీను వైట్ల.
సందర్భంగా నిర్మాత దానయ్య డి.వి.వి. మాట్లాడుతూ..' మెగాస్టార్ చిరంజీవి గారు మా బ్యానర్లో అందులోనూ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో మేము ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో 'స్పెషల్ అప్పియరెన్స్' లో కంపించనుండటం ఎంతో సంతోషంగా ఉంది. ఆయన కనిపించేది కొద్ది నిమిషాలే అయినా అవి మెగాభిమానులకు కన్నుల పండుగలా అనిపిస్తాయని తెలిపారు నిర్మాత దానయ్య డి .వి.వి. మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' తో పాటు ఇతర ప్రధాన తారాగణం అంతా పాల్గొనగా టాకీ పార్ట్ కు సంభందించిన సన్నివేశాలను హైదరాబాద్ లో ప్రస్తుతం చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు నిర్మాత దానయ్య డి.వి.వి. విజయదశమి కానుకగా చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ చిత్రానికి సంభందించి ఇంకా ఎలాంటి పేరును నిర్ణయించలేదని తెలిపారు. నాయక్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఈ సినిమా నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. భారీ తారాగణం తో పాటు, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం ముస్తాబౌతుందని అన్నారు. ఈ చిత్రానికి కథ : కోన వెంకట్, గోపి మోహన్, మాటలు: కోన వెంకట్, రచనా సహకారం: ఉపేంద్ర మాధవ్ , ప్రవీణ్ , లైన్ ప్రొడ్యూసర్ : కృష్ణ , , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి. వై. ప్రవీణ్ కుమార్ , సమర్పణ : డి. పార్వతి , నిర్మాత : దానయ్య డి.వి.వి., మూలకథ, దర్శకత్వం: శ్రీనువైట్ల.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments