నాని 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' ఫస్ట్ లుక్ విడుదల

  • IndiaGlitz, [Thursday,January 07 2016]

నమో వెంకటేశ', దూకుడు', 1 నేనొక్కడినే', లెజెండ్', పవర్'(కన్నడం), ఆగడు', వంటి భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం7గా యంగ్ హీరో నాని, మెహరీన్(నూతన పరిచయం) హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం కృష్ణగాడి వీర ప్రేమగాథ' ఫస్ట్ లుక్ ఈరోజు విడుదలైంది. భలే భలే మగాడివోయ్' వంటి సక్సెస్ ఫుల్ చిత్రం తర్వాత నాని హీరోగా నటిస్తున్న చిత్రమిది.

అందాల రాక్షసి వంటి డిఫరెంట్ లవ్ స్టోరీతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన యంగ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకుడిగా ఈ ఎగ్జయిటింగ్ ఎంటర్ టైనింగ్ లవ్ స్టోరి తెరకెక్కుతోంది. రామ్ అచంట, గోపీచంద్ అచంట, అనిల్ సుంకర నిర్మాతలు. ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు అసిస్టెంట్ యువరాజ్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఎ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ స్కూల్ కు చెందిన విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఫిభ్రవరి మొదటి వారంలో సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఒక సాంగ్ మినహా సినిమా షూటింగ్ పూర్తయిందని చిత్ర నిర్మాతలు తెలియజేశారు.

నాని, మెహరీన్, సంపత్, మురళీశర్మ, బ్రహ్మాజీ, పృథ్వీ, శత్రు, హరీష్ ఉత్తమన్, బేబి నయన, మాస్టర్ ప్రతాప్, బేబి మోక్ష తదితరులు తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: యువరాజ్, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, ఫైట్స్: విజయ్, డ్యాన్స్: రాజు సుందరం, ఎడిటర్: వర్మ, ఆర్ట్: అవినాష్ కొల్ల, లైన్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా, లిరిక్స్: కె.కె.(కృష్ణకాంత్), కో డెరక్టర్: సాయి దాసం, డైలాగ్స్: హను రాఘవపూడి, జయకృష్ణ, నిర్మాతలు: రామ్ అచంట, గోపీచంద్ అచంట, అనిల్ సుంకర, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: హను రాఘవపూడి.

More News

సూర్య సినిమాలో బాలీవుడ్ భామ‌..

త‌మిళ హీరో సూర్య విక్ర‌మ్ కుమార్ డైరెక్ష‌న్ లో 24, హ‌రి డైరెక్ష‌న్ లో సింగం 3 సినిమాల్లో న‌టిస్తున్నారు.

చైతు ప్రేమ‌మ్ రిలీజ్ డేట్ ఫిక్స్..

నాగ చైత‌న్య హీరోగా కార్తీకేయ ఫేం చందు మొండేటి తెర‌కెక్కిస్తున్న చిత్రం ప్రేమ‌మ్. ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ వంశీ నిర్మిస్తున్నారు.

అభిమానికి అన్యాయం జ‌రిగితే నో లాజిక్స్ అంటున్న‌ రామ్..

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ నేను...శైల‌జ సినిమా గురించి ట్విట్ట‌ర్ లో...ఒక న్యూస్ ఛాన‌ల్ లో త‌ప్ప వ‌ర‌ల్డ్ వైడ్ నేను...శైల‌జ సినిమా చాలా బాగా ర‌న్ అవుతుంది.

ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీతో వ‌స్తున్న త‌రుణ్‌

లవర్ బాయ్ అనగానే మనకు గుర్తుకొచ్చె పేరు తరుణ్ . ప్రేమకధా చిత్రాలతో తెలుగులో తనదైన మార్క్ క్రియేట్ చేసిన ఈ హ్యాండ్సమ్ హీరో కొంత గ్యాప్ అనంతరం మళ్లీ మరో వైవిధ్యమైన లవ్ స్టోరీతొ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

నా రియ‌ల్ లైఫ్ లో ఆ...ఇద్ద‌రి ఆలోచ‌న‌లు క‌లిసున్న వ్య‌క్తినే కోరుకుంటా - హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి

అందాల రాక్ష‌సి సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై...తొలి చిత్రంతోనే ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నక‌థానాయిక లావ‌ణ్య త్రిపాఠి. ఆత‌ర్వాత దూసుకెళ్తా, భ‌లే భ‌లే మ‌గాడివోయ్, ల‌చ్చిందేవికి ఓ లెక్కుంది చిత్రాల్లో న‌టించిన లావ‌ణ్య‌.