నాగ్ , కార్తీ ల మూవీ ఫస్ట్ లుక్ డేట్ ఫిక్స్...
Send us your feedback to audioarticles@vaarta.com
నాగార్జున, కార్తీ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. వంశీ పైడిపల్లి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో పి.వి.పి సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అయితే ఈ సినిమా టైటిల్ అంటూ దోస్త్, మిత్రులు, ఊపిరి ప్రచారం లో ఉన్నాయి. పి.వి.పి సంస్థ ఫిలిం ఛాంబర్లో ఊపిరి అనే టైటిల్ రిజిష్టర్ చేయించడంతో ఈ సినిమాకి ఊపరి అనే టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం.
అయితే ఈ సినిమాకి సంబంధించి నాగ్ ట్విట్టర్ లో స్పందిస్తూ..సెలబ్రేషన్స్ ఆఫ్ లైఫ్ బిగిన్స్ సెప్టెంబర్ 18 అంటూ ఓ పోస్టర్ పోస్ట్ చేసారు. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ సెప్టెంబర్ 18న రిలీజ్ చేయనున్నారు. విభిన్న కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా ప్రచారంలో కూడా వైవిధ్యం చూపిస్తుంది. ఈ సినిమా లో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా, అనుష్క గెస్ట్ రోల్ పోషిస్తుండడం విశేషం. ఇంతకీ నాగ్, కార్తీల క్రేజీ మూవీకి టైటిల్ ఏమిటి..? ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుంది అనేది తెలియాలంటే ఈ నెల 18 వరకు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments