నాగ్ , కార్తీ ల మూవీ ఫస్ట్ లుక్ డేట్ ఫిక్స్...

  • IndiaGlitz, [Monday,September 14 2015]

నాగార్జున‌, కార్తీ కాంబినేష‌న్లో రూపొందుతున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. వంశీ పైడిప‌ల్లి ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో పి.వి.పి సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అయితే ఈ సినిమా టైటిల్ అంటూ దోస్త్, మిత్రులు, ఊపిరి ప్ర‌చారం లో ఉన్నాయి. పి.వి.పి సంస్థ ఫిలిం ఛాంబ‌ర్లో ఊపిరి అనే టైటిల్ రిజిష్ట‌ర్ చేయించడంతో ఈ సినిమాకి ఊప‌రి అనే టైటిల్ ఖ‌రారు చేసిన‌ట్టు స‌మాచారం.

అయితే ఈ సినిమాకి సంబంధించి నాగ్ ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ..సెల‌బ్రేష‌న్స్ ఆఫ్ లైఫ్ బిగిన్స్ సెప్టెంబ‌ర్ 18 అంటూ ఓ పోస్ట‌ర్ పోస్ట్ చేసారు. ఈ సినిమాకి సంబంధించి ఫ‌స్ట్ లుక్ అండ్ టైటిల్ సెప్టెంబ‌ర్ 18న రిలీజ్ చేయ‌నున్నారు. విభిన్న క‌థాంశంతో రూపొందుతున్న ఈ సినిమా ప్ర‌చారంలో కూడా వైవిధ్యం చూపిస్తుంది. ఈ సినిమా లో త‌మ‌న్నా హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా, అనుష్క గెస్ట్ రోల్ పోషిస్తుండ‌డం విశేషం. ఇంత‌కీ నాగ్, కార్తీల క్రేజీ మూవీకి టైటిల్ ఏమిటి..? ఫ‌స్ట్ లుక్ ఎలా ఉండ‌బోతుంది అనేది తెలియాలంటే ఈ నెల 18 వ‌ర‌కు ఆగాల్సిందే.

More News

చైనాలో ప్రభాస్ సందడి

‘బాహుబలి’ సినిమా రిలీజ్ తర్వాత తెలుగు సినిమా మార్కెట్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. నిజం చెప్పాలంటే ఓ రకంగా ఊపిరి లూది సినిమా స్పాన్ పెరిగేలా చేసింది.

రజనీకాంత్ కి వార్నింగ్...

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం'కబాలి'సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.

ఆ బ‌హుమ‌తి విలువ అదిరింది

యాదృచ్చిక‌మో ఏమో కానీ మ‌ల‌యాళ ముద్దుగుమ్మ‌కు త‌న సినిమా గ‌జినీ త‌రహాలోనే కాస్ట్‌లీ బాయ్‌ఫ్రెండ్, మైక్రోమ్యాక్స్ కో ఫౌండ‌ర్ రాహుల్‌శ‌ర్మ‌దొరికాడు.

కొర‌టాల శివ త‌దుప‌రి చిత్రం ఫిక్స్ అయ్యింద‌ట‌

మిర్చి, శ్రీమంతుడు...చిత్రాల‌తో వ‌రుస‌గా సంచ‌ల‌న విజ‌యాలు సాధించి త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌చుకున్న క్రేజీ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌.

నవ్యాంధ్రలో 'ఫ్రెండ్ రిక్వెస్ట్'

మోడరన్ సినిమా పతాకంపై ఆదిత్యాఓం స్వీయదర్శకత్వంలో విజయ్ వర్మ పాకలపాటి నిర్మాణ భాగస్వామ్యంలో రూపుదిద్దుకొంటున్న 'ఫ్రెండ్ రిక్వెస్ట్'