ఫస్ట్.. పలాసలోనే!
- IndiaGlitz, [Monday,July 22 2019]
మెగాస్టార్ చిరంజీవి త్వరలో 20 రోజుల పాటు పలాసలో స్టే చేయబోతున్నారు. అదీ ఒంటరిగా కాదు. తన ఫ్యామిలీతో. సినిమా ఫ్యామిలీతో. కొరటాల దర్శకత్వంలో తాను నటించబోతున్న సినిమా ఫ్యామిలీతో. కొరటాల శివ దర్శకత్వంలో ఆయన నటించబోయే సినిమా షూటింగ్ పలాసలో నవంబర్‌లో 20 రోజుల పాటు ఏకబిగిన జరగనుంది. పల్లెటూరి నేపథ్యంలో సాగే అన్ని సన్నివేశాలనూ అక్కడ చిత్రీకరించనున్నారు.
'సైరా'కోసం కృష్ణానగర్‌లోని జూనియర్ ఆర్టిస్టులను బస్సుల్లో తరలించినట్టు, ఈ సినిమా కోసం కూడా వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులను తీసుకెళ్తారని తెలుస్తోంది. 'సైరా' తర్వాత వస్తున్న సినిమా కాబట్టి స్క్రిప్ట్ ఎక్కడా పట్టు సడలకుండా సిద్ధం చేసుకున్నారట కొరటాల. ఒకటికి, పదిసార్లు లాజిక్కులు చెక్ చేసుకున్నారట. ఓ మాంఛి సోషల్ మెసేజ్‌ను ఈ సినిమాలో చెప్పుబోతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. మరోవైపు 'సైరా' పనులన్నీ వచ్చేనెలాఖరులోపు పూర్తవుతాయని టాక్.