ఫ‌స్ట్.. ప‌లాస‌లోనే!

  • IndiaGlitz, [Monday,July 22 2019]

మెగాస్టార్ చిరంజీవి త్వ‌ర‌లో 20 రోజుల పాటు ప‌లాస‌లో స్టే చేయ‌బోతున్నారు. అదీ ఒంట‌రిగా కాదు. త‌న ఫ్యామిలీతో. సినిమా ఫ్యామిలీతో. కొరటాల ద‌ర్శ‌క‌త్వంలో తాను న‌టించ‌బోతున్న సినిమా ఫ్యామిలీతో. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆయ‌న న‌టించ‌బోయే సినిమా షూటింగ్ ప‌లాస‌లో న‌వంబ‌ర్‌లో 20 రోజుల పాటు ఏక‌బిగిన జ‌ర‌గ‌నుంది. ప‌ల్లెటూరి నేప‌థ్యంలో సాగే అన్ని స‌న్నివేశాల‌నూ అక్క‌డ చిత్రీక‌రించ‌నున్నారు.

'సైరా'కోసం కృష్ణాన‌గ‌ర్‌లోని జూనియ‌ర్ ఆర్టిస్టుల‌ను బస్సుల్లో త‌ర‌లించిన‌ట్టు, ఈ సినిమా కోసం కూడా వంద‌లాది మంది జూనియ‌ర్ ఆర్టిస్టుల‌ను తీసుకెళ్తార‌ని తెలుస్తోంది. 'సైరా' త‌ర్వాత వ‌స్తున్న సినిమా కాబ‌ట్టి స్క్రిప్ట్ ఎక్క‌డా పట్టు స‌డ‌ల‌కుండా సిద్ధం చేసుకున్నార‌ట కొర‌టాల‌. ఒక‌టికి, ప‌దిసార్లు లాజిక్కులు చెక్ చేసుకున్నార‌ట‌. ఓ మాంఛి సోష‌ల్ మెసేజ్‌ను ఈ సినిమాలో చెప్పుబోతున్నార‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది. మ‌రోవైపు 'సైరా' ప‌నుల‌న్నీ వ‌చ్చేనెలాఖ‌రులోపు పూర్త‌వుతాయ‌ని టాక్‌.

More News

హైద‌రాబాద్‌కొచ్చిన క‌ర్నూలు...

త‌మ హీరోల కోసం ఆయా ఊర్ల నుంచి అభిమానులు హైద‌రాబాద్‌కి త‌ర‌లిరావ‌డం మ‌న‌కు ఇంత‌కు ముందే తెలుసు.

ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు చేతుల మీదుగా `గుణ 369`లోని మూడో పాట విడుద‌ల‌!

ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు చేతుల మీదుగా `గుణ 369`లోని మూడో పాట సోమ‌వారం హైద‌రాబాద్‌లో విడుద‌లైంది.

తాన్యా... హోప్ ఫ‌లించిన‌ట్టేగా

కాస్త అందం, అభిన‌యం ఉన్న‌ హీరోయిన్లు ఓ మోస్త‌రు హీరోల ప‌క్కన న‌టించ‌డం ప‌రిపాటి. మ‌రో అడుగు ముందుకేసి ర‌వితేజ‌లాంటి వారి స‌ర‌స‌న న‌టించ‌డ‌మంటే...

విక్టరీ వెంకటేష్‌ క్లాప్‌తో ప్రారంభమైన మా ఆయి ప్రొడక్షన్స్‌ యాక్షన్ థ్రిల్లర్ '22'

శివకుమార్‌ బి. దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపేష్‌ కుమార్‌ చౌదరి, సలోని మిశ్రా హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్  '22'.

షాకింగ్ వీడియోను పోస్ట్ చేసిన రజనీకాంత్ సతీమణి!

సూపర్‌స్టార్ రజనీకాంత్ సతీమణి లత తన ట్విట్టర్ వేదికగా ఓ షాకింగ్ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూసిన జనాలంతా ఒకింత తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు.