Pushpa 2 : పుష్ప ఎక్కడ.. బన్నీ ఫ్యాన్స్‌కి బిగ్‌ సర్‌‌ప్రైజ్, పూనకాలు తెప్పిస్తోన్న గ్లింప్స్

  • IndiaGlitz, [Wednesday,April 05 2023]

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘‘పుష్ప’’ సినిమా సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్నీ కావు. ఈ సినిమాలోని పాటలు, డైలాగ్స్, ఫైట్స్‌ ప్రజలను విశేషంగా అలరించాయి. ఎక్కడ చూసినా పుష్ప పేరు బాగా వినిపించింది. వయసుతో సంబంధం లేకుండా ‘‘తగ్గేదే లే’’ అంటూ పుష్ప సినిమా డైలాగ్స్, అల్లు అర్జున్ మేనరిజాన్ని అనుకరించారు. వీరిలో సినీతారలు, క్రీడాకారులు చివరికి రాజకీయ నాయకులు కూడా వున్నారు. ముఖ్యంగా చిన్నారులైతే మెడ కిందగా చేతులు పోనిస్తూ నానా అల్లరి చేస్తున్నారు. ఇక ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పలు పార్టీలు ప్రచారానికి పుష్ప సినిమాను వాడుకున్నాయి. పుష్ప సినిమాను భాషతో సంబంధం లేకుండా దేశప్రజలు ఓన్ చేసుకొని సెలబ్రేట్ చేసుకొంటున్నారు.

రూల్ చేయడానికి ముందు హంట్:

ఈ నేపథ్యంలో పుష్ప 2 సెట్స్ పైకి వెళ్లింది. దేశం మొత్తం ఈ సీక్వెల్ కోసం ఎంతగానో ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ శుభవార్త చెప్పింది. హీరోయిన్ రష్మిక మందన్నా బర్త్ డే ను పురస్కరించుకుని ‘పుష్ప 2’కి సంబంధించిన వీడియో గ్లింప్స్‌ని విడుదల చేశారు. ఇందులో తిరుపతి జైలు నుంచి (2004)లో బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప.. పుష్ప ఎక్కడంటూ న్యూస్ రీడర్ల వాయిస్ ఓవర్‌తో వీడియో ప్రారంభమవుతుంది. అంతేకాకుండా ఓ బైక్‌పై పుష్ప తప్పించుకుని పోతున్న వీడియోను కూడా చూపించారు. అలాగే పుష్ప కోసం జనాలు ఆందోళనలు చేస్తుంటే.. వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం కనిపిస్తుంది. చివరిలో ‘‘రూల్ చేయడానికి ముందు హంట్’’ అంటూ కనిపిస్తుంది. ఈ వీడియో గ్లింప్స్‌తో బన్నీ ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటుండగా, మరోసారి టాలీవుడ్‌తో పాటు యావత్ దేశం పూనకాలతో ఊగిపోవడం ఖాయంగా కనిపిస్తుంది.

బన్నీ బర్త్ డే నాడు మరో గ్లింప్స్ :

ఇకపోతే.. ఈ నెల 8వ తేదీన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డేను పురస్కరించకుని మరో గ్లింప్స్‌ విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. దీంతో అది ఎలా ఉండబోతుందోనని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ ఇందులో విలన్‌గా నటిస్తుండగా.. అనసూయ, సునీల్, ధనుంజయ్, రావు రమేశ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. అతి త్వరలోనే ‘‘పుష్ప 2’’ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించనున్నారు.