థియేటర్లు తెరిచాక రిలీజ్ కాబోయే తొలి సినిమా ఏదంటే...
Send us your feedback to audioarticles@vaarta.com
సినిమా షూటింగ్‌లు.. ప్రతి ఒక్క హీరోది ఏదో ఒక సినిమా.. ఒక్కొక్కరు రెండు మూడు సినిమాలు సైతం కవర్ చేస్తుంటారు. సినిమా ప్రారంభమైందంటే.. సినిమా పట్టాలెక్కిందని పిక్స్.. ఫస్ట్ లుక్ నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకూ ఏదో ఒక అప్డేట్.. ఇలా దాదాపు ప్రతిరోజూ సినిమాలకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ సందడి చేస్తూనే ఉంటుంది. ఇవి కాక.. ఇక ఫేవరెట్ హీరోలకు సంబంధించిన మూవీ అప్డేట్స్ ఎప్పుడూ ఏదో ఒకటి అభిమానులను కనువిందు చేస్తూనే ఉంటుంది. ఇక శుక్రవారం వచ్చిందంటే సినీ ప్రియులకు పండుగే పండుగ.. ఏదో ఒక సినిమా రిలీజ్ ఉంటుంది. ఇంత సందడి మొత్తం మార్చి మూడో వారం వచ్చేసరికి ఒక్కసారిగా మాయమైంది. సినిమాలు.. షూటింగ్‌లు.. ధూమ్ ధామ్.. అంతా తుస్ అయిపోయింది.
మళ్లీ ఆరు నెలల తర్వాత షూటింగ్‌లు స్టార్ట్.. రాజమౌళి దుమ్ము దులిపారు.. ‘రంగే దే’ సందడి.. మహేష్ యూస్ షెడ్యూల్.. ఇలా ఒకటేమిటి.. ఎన్నో అప్డేట్స్.. మళ్లీ కొత్త కొత్త అంచనాలతో సినిమాల షూటింగ్‌లు ప్రారంభమై పోయాయి. మూతపడిన థియేటర్లు సైతం అక్టోబర్ 15 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అంతా ఓకే కానీ రిలీజ్ అవబోయే తొలి సినిమా ఏంటి? అనేది నిన్న మొన్నటి వరకూ ఉత్పన్నమైన ప్రశ్న. దీనికి మన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నుంచి సమాధానం వచ్చింది. ఆగస్త్య మంజు దర్శకత్వంలో అన్నపురెడ్డి ఎల్లారెడ్డితో కలిసి తాను నిర్మించిన ‘కరోనా వైరస్’ విడుదలవుతుందని రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు. ఇక తొలి సినిమా కన్ఫర్మ్ అయిపోయింది. ఇక స్టార్ హీరోల మాటేంటి?
దయచేసి ఆ ఒక్కటే ఇప్పటికైతే అడగొద్దు. స్టార్ హీరోలు సినిమాలు ఈ ఏడాదికి దాదాపు లేనట్టే. స్టార్ హీరోలందరి సినిమాలు షూటింగ్ దశలోనే ఉన్నాయి. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నటించిన ‘జాతి రత్నాలు’, యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ‘మహానటి’ తర్వాత స్వప్న సినిమా సంస్థ ‘జాతి రత్నాలు’ నిర్మించింది. మెగా కుటుంబం నుంచి సాయి తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’, అతని తమ్ముడు పంజా వైష్ణవ్‌తేజ్ కథానాయకుడిగా పరిచయమవుతున్న ‘ఉప్పెన’ చిత్రాలు సైతం విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ ఏడాది మాత్రం ఆశించిన స్థాయిలో సినిమాలు ఉండవనే చెప్పాలి. ఈ సారి సంక్రాంతి మాత్రం స్టార్ హీరోలను వెంటబెట్టుకుని మరీ వస్తుందనడంలో సందేహం లేదు. అప్పటి నుంచి అసలైన సినీ సందడి ప్రారంభం కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments