Leo:బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపిన 'లియో' తొలి రోజు వసూళ్లు..
Send us your feedback to audioarticles@vaarta.com
దళపతి విజయ్, సెన్సేషన్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'లియో' మూవీ తొలి రోజు బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపింది. పాన్ ఇండియా మూవీగా గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ రికార్డు ఓపెనింగ్స్ రాబట్టింది. వరల్డ్ వైడ్గా రూ.132.5 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఒక్క తమిళనాడులోనే ఈ మూవీ రూ.43 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. ఇప్పటివరకు విడుదలైన తమిళ సినిమాల్లో ఇదే రికార్డు అని తెలిపింది.
తెలుగులోనూ భారీ ఓపెనింగ్స్..
డైరెక్టర్ లోకేశ్ ఖైదీ, విక్రమ్ సినిమాలతో తెలుగులో సూపర్ క్రేజ్ కొట్టేశాడు. ఇక విజయ్ కూడా మాస్టర్, పోలీసోడు, వారసుడు సినిమాలతో తెలుగులోనూ అభిమానులను దక్కించుకున్నాడు. దీంతో లియోపై తెలుగు అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్లే మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. బాలయ్య నటించిన భగవంత్ కేసరి పోటీగా ఉన్నప్పటికీ లియోకి తెలుగులో సాలిడ్ ఓపెనింగ్స్ రావడం విశేషం. తెలుగులో 20 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.30 నుంచి రూ.40 కోట్లు రాబట్టాలి.
బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా..? లేదా..?..
ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించాలి. లోకేశ్ సినిమాటిక్ యూనివర్సిటీలో భాగంగా ఖైదీ, విక్రమ్ సినిమాలతో లియోకు కూడా లింక్ పెట్టి అదరగొట్టాడు. అయితే లోకేశ్ గత చిత్రాల స్థాయిలో లియో లేకపోవడంతో ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే వరుస సెలవులు కావడంతో వసూళ్లు పెరిగే అవకాశం ఉంది. మరి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా..? లేదా..? అనేది చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments