Bigg Boss 7 Telugu : బిగ్‌బాస్ హౌస్‌లో తొలి కెప్టెన్సీ టాస్క్.. శోభాశెట్టి చీటింగ్, ఏం మనుషుల్రా అంటూ శివాజీ అసహనం

  • IndiaGlitz, [Wednesday,October 04 2023]

బిగ్‌బాస్ హౌస్‌లో ఈ వారం నామినేషన్స్ చప్పగా సాగడంతో ప్రేక్షకులు నిరుత్సాహాపడ్డారు. బిగ్‌బాస్ షోను ప్రతి సోమవారం, వీకెండ్‌లలో ఎవ్వరూ మిస్ కారు. ఆ రోజున ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం దొరుకుతుంది. అలాంటి సోమవారం కంటెస్టెంట్స్ సిల్లీ రీజన్స్‌ చెప్పడం.. శివాజీ మాట్లాడితే నేను బయటికి వెళ్లిపోతానంటూ నస పెట్టడంతో ప్రేక్షకులు అసంతృప్తికి గురయ్యారు. దీంతో బిగ్‌బాస్ తన అస్త్రాన్ని బయటకు తీశాడు. అదే కెప్టెన్సీ టాస్క్. ఐదో వారం కావొస్తున్నా ఇంటికి కెప్టెన్ లేడేంటీ అని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. ఈ లోటు తీర్చేందుకు , టీఆర్పీని రాబట్టేందుకు బిగ్‌బాస్ ఇంట్లో కెప్టెన్సీ టాస్క్ మొదలైంది.

పవర్ అస్త్ర వున్న సందీప్, శోభాశెట్టి, పల్లవి ప్రశాంత్ మినహా మిగిలిన కంటెస్టెంట్స్ అంతా ఈ వారం నామినేషన్స్‌లో వున్న సంగతి తెలిసిందే. శివాజీ నుంచి పవర్ అస్త్రను లాక్కోవడంతో ఆయన కూడా సాధారణ కంటెస్టెంట్‌గా మారిపోయాడు. అయితే ఈరోజు మాత్రం బిగ్‌బాస్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఇచ్చిన పవర్ అస్త్రలు అన్నీ లాగేసుకున్నాడు. తనది మాత్రం లాక్కున్నారని ఫీలైన శివాజీ ఈ దెబ్బకు బాగా హ్యాపీ ఫీలయ్యాడు. దీంతో ఇప్పుడు అందరూ టాస్క్‌ల్లో పాల్గొనాల్సి వుంటుంది.

ఈ సందర్భంగా హౌస్‌లో మీకు బాగా దగ్గరైన వారిని, నచ్చిన వారిని పార్ట్‌నర్‌గా సెలక్ట్ చేసుకోవాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. దీంతో శివాజీ - ప్రశాంత్, గౌతమ్ - శుభశ్రీ, యువర్ - తేజ, అమర్ దీప్ - సందీప్, ప్రియాంక - శోభాశెట్టిలు జంటలుగా విడిపోయారు. వీరందరికీ ‘‘గెలిపించేది మీ నవ్వే’’ అంటూ స్మైల్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో భాగంగా బోర్డుపై ఒక నవ్వుతూ వుండే చిత్రం వుంటుంది. దానికి కొన్ని పళ్లు వుండవు. కంటెస్టెంట్స్ అంతా లాన్‌లో వున్న రెండు ఏరియాల నుంచి పాకుకుంటూ వెళ్లి.. యాక్టివిటీ ఏరియాలోని ప్లేసులో నెంబర్స్ వెతకాలి. ఆ సంఖ్యల ఆధారంగా వాటిని చిత్రంలో అమర్చాల్సి వుంటుంది. ఇందులో గెలిచిన వారు బిగ్‌బాస్ 7లో తొలి కెప్టెన్‌గా నిలవడంతో పాటు సూపర్ ఇమ్యూనిటీ లభిస్తుందని , ఈవారంతో పాటు వచ్చే వారం నామినేషన్స్ నుంచి సేవ్ అవుతారని బిగ్‌బాస్ చెప్పాడు.

టాస్క్ మొదలవ్వగానే ముందు శివాజీ, ప్రశాంత్ జోడీ నెంబర్స్‌ను ఫిట్ చేసి బెల్ కొట్టారు. ఆ తర్వాత అమర్ దీప్ - సందీప్, ప్రియాంక - శోభాశెట్టి . గౌతమ్ - శుభశ్రీలు టాస్క్ కంప్లీట్ చేశారు. దీనికి యువర్, శోభాశెట్టిలు సంచాలకులుగా వ్యవహరించారు. అయితే అందరూ తప్పుగా నెంబర్స్ సెట్ చేయడంతో చాలా సేపు వాదనలు, చర్చలు జరిగాయి. చివరికి గౌతమ్ - శుభశ్రీలకు ఫస్ట్ ప్లేస్, అమర్ దీప్ - సందీప్‌లకు సెకంట్ ప్లేస్ .. శివాజీ - ప్రశాంత్‌లకు థర్డ్ ప్లేస్ ఇచ్చారు. సంచాలకులుగా వ్యవహరించిన వారి నిర్ణయాన్ని అమర్, ప్రియాంక అభ్యంతరం తెలిపారు. శివాజీ అయితే ఏం మనుషల్రా బాబు అంటూ దూరంగా వెళ్లిపోయాడు. ఈ గొడవ రేపు కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More News

Ram Charan:మరో గుర్రాన్ని కొనుగోలు చేసిన చరణ్.. నా కొత్త ఫ్రెండ్ అంటూ పోస్ట్, బ్లాక్ డ్రెస్‌లో గ్లోబల్ స్టార్ స్టైలిష్ లుక్

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ తేజ్‌కు సినిమాలు, వ్యాపారాలతో పాటు జంతువులతో గడపడం చాలా ఇష్టం .

Minister Roja:కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి రోజా.. మీ ఇంట్లో ఆడవాళ్లకు కూడా ఇలాగే జరిగితే ఊరుకుంటారా..?

మాజీ మంత్రి బండారు సత్యనారాయణ తనపై చేసిన వ్యాఖ్యలను మంత్రి రోజా తీవ్రంగా ఖండించారు.

Chiranjeevi : త్రివిక్రమ్ డైరెక్షన్‌లో మెగాస్టార్ .. అలాంటి ఇలాంటి ప్రాజెక్ట్ కాదు..!!

ఆసక్తికరమైన కథలకు, పంచ్ డైలాగ్‌లకు పెట్టింది పేరు త్రివిక్రమ్. ఆయన కలం నుంచి వచ్చే పవర్ ఫుల్ డైలాగ్స్‌ ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తాయి.

Nobel Prizes:భౌతిక శాస్త్రంలో ముగ్గురిని వరంచిన నోబెల్ బహుమతులు

2023 సంవత్సరానికి గాను భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి అవార్డును రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది.

Narendra Modi:కేసీఆర్‌ నన్ను కలిశారు.. నా కళ్లలోకి చూసే ధైర్యం లేదు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

ఎన్నికల వేళ తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన మోదీ..