పార్లమెంట్ అనెక్స్ భవనంలో చెలరేగిన మంటలు..
Send us your feedback to audioarticles@vaarta.com
పార్లమెంట్ అనెక్స్ భవనంలో సోమవారం ఉదయం మంటలు చెలరేగాయి. అనెక్స్ భవనంలోని ఆరో అంతస్తులో అనూహ్యంగా అది కూడా ఎలక్ట్రిక్ బోర్డు సమీపంలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన పార్లమెంటు రక్షణ సిబ్బంది.. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చాయి. దీంతో హుటాహుటిన ఐదు ఫైరింజన్లు ఘటనా స్థలికి చేరుకుని... మంటలను ఆర్పివేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు ప్రకటించారు. షాట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు.
ప్రస్తుతం పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావాల్సి ఉంది. దీనికి ఓ వైపు ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది. కరోనా కారణంగా పార్లమెంటు సమావేశాలు సైతం మార్చిలోనే ఆగిపోయాయి. ప్రస్తుతం కరోనా మరింత విజృంభించింది. ఈ సమయంలో సమావేశాలు ఎలా నిర్వహించాలనే దానిపై అధికారులు కసరత్తు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికైతే.. లోక్‌సభను నాలుగు గంటల పాటు.. రాజ్యసభను 4 గంటల పాటు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్వహించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout