పార్లమెంట్ అనెక్స్ భవనంలో చెలరేగిన మంటలు..

  • IndiaGlitz, [Monday,August 17 2020]

పార్లమెంట్ అనెక్స్ భవనంలో సోమవారం ఉదయం మంటలు చెలరేగాయి. అనెక్స్ భవనంలోని ఆరో అంతస్తులో అనూహ్యంగా అది కూడా ఎలక్ట్రిక్ బోర్డు సమీపంలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన పార్లమెంటు రక్షణ సిబ్బంది.. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చాయి. దీంతో హుటాహుటిన ఐదు ఫైరింజన్లు ఘటనా స్థలికి చేరుకుని... మంటలను ఆర్పివేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు ప్రకటించారు. షాట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు.

ప్రస్తుతం పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావాల్సి ఉంది. దీనికి ఓ వైపు ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది. కరోనా కారణంగా పార్లమెంటు సమావేశాలు సైతం మార్చిలోనే ఆగిపోయాయి. ప్రస్తుతం కరోనా మరింత విజృంభించింది. ఈ సమయంలో సమావేశాలు ఎలా నిర్వహించాలనే దానిపై అధికారులు కసరత్తు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికైతే.. లోక్‌సభను నాలుగు గంటల పాటు.. రాజ్యసభను 4 గంటల పాటు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్వహించారు.

More News

ఓ వ్యక్తి ప్రాణం కోసం పుణె నుంచి హైదరాబాద్‌కు గంటలో లంగ్స్ తరలింపు

కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో మనిషి ఒక చోటు నుంచి మరో చోటుకి ప్రయాణించడమే కష్టంగా ఉంది.

కాజ‌ల్‌కు ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా..?

ద‌శాబ్దం కాలం ముందు తెలుగు ప్రేక్ష‌కుల‌ను హీరోయిన్‌గా ప‌ల‌క‌రించింది కాజ‌ల్ అగ‌ర్వాల్‌.

అల్లు శిరీష్ మొదలు పెట్టిన గో లోక‌ల్ బీ వోక‌ల్ మూమెంట్ కి విశేష స్పందన

యంగ్ హీరో అల్లు శిరీష్ సరికొత్తగా గోలోక‌ల్ బీ వోక‌ల్ అనే ఉద్యమానికి నాంది పలికిన విషయం తెల్సిందే.

విరుచుకుపడిన వైసీపీ కార్యకర్తలు.. ఇక ట్వీట్ చేయనన్న రామ్

ఒక్కసారిగా సంచలన ట్వీట్లు చేసి ఒక్కసారిగా టాక్ ఆఫ్‌ ది టౌన్‌గా మారిన హీరో రామ్.. అంతే స్పీడుగా ఇక ఈ అంశంపై తానేమీ మాట్లాడబోనని తేల్చి చెప్పేశాడు.

కరోనా మనకొస్తాది అనుకున్నా.. కానీ క్లైమాక్స్ చూశా: బిత్తిరి సత్తి

బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవికుమార్‌కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఓ వీడియో ద్వారా వెల్లడించారు.