అఖండ సినిమా ఆడుతున్న థియేటర్‌లో మంటలు.. పరుగులు తీసిన ప్రేక్షకులు

  • IndiaGlitz, [Monday,December 06 2021]

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. చాలా రోజుల తర్వాత బాలయ్య తెలుగు సినిమాకు సందడి తెచ్చారు. కరోనా భయంతో గడిచిన కొద్దినెలలుగా థియేటర్లు బోసిపోయిన సంగతి తెలిసిందే. అయితే మంచి మౌత్ టాక్‌తో ‘‘అఖండ’’ సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రదర్శిస్తోన్న థియేటర్ల దగ్గర అభిమానుల కేరింతలతో సందడిగా నిలిచింది.

అయితే శ్రీకాకుళంలోని రవిశంకర్‌ థియేటర్‌లో అపశృతి చోటు చేసుకుంది. తెరవెనుక ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయభ్రాంతులకు గురైన ప్రేక్షకులు బయటకు పరుగులు తీశారు. సౌండ్‌ సిస్టమ్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ఈ మంటలు చెలరేగాయి. వెంటనే థియేటర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తీసురావడంతో ప్రేక్షకులు ఊపిరి పీల్చుకున్నారు.

మరోవైపు అఖండ సినిమా 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.35 కోట్లకు పైగా షేర్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. తెలుగు రాష్ట్రాల్లోనే 29.50 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది అఖండ. ఈ కలెక్షన్ల జాతర చూసిన తర్వాత అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. బాలయ్య బాక్సాఫీస్ స్టామినా తగ్గిపోయిందని కామెంట్ చేసిన వాళ్లకు అఖండ సినిమాతో దిమ్మ తిరిగిపోయే ఆన్సర్ ఇచ్చాడు నందమూరి అందగాడు.

More News

మరో జానపద గాయకురాలిని స్టార్‌ని చేసిన ‘‘భీమ్లా నాయక్’’ .. ఎవరీ కుమ్మరి దుర్గవ్వ..?

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, రానాలు ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘‘భీమ్లా నాయక్’’.

యాంకర్ అనసూయ ఇంట్లో విషాదం.. తండ్రి సుదర్శన్ రావు కన్నుమూత

జబర్దస్ట్ యాంకర్, సినీ నటి అనసూయ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి సుదర్శన్ రావు అనారోగ్యంతో కన్నుమూశారు.

బిగ్‌బాస్ 5 తెలుగు: శ్రీహాన్ గిఫ్ట్.. సిరి కోసం షన్నూ త్యాగం, పింకీకి హౌస్‌లో ఉండే అర్హత లేదా..?

బిగ్‌బాస్ 5 తెలుగులో శనివారం ఎపిసోడ్ సంతోషాలు, ఎమోషనల్ మేళవింపుగా సాగింది. నాగార్జున ఇంటి సభ్యులకు కొన్ని పరీక్షలు పెట్టి వారితో కామెడీ చేయించారు.

‘రామ్‌ అసుర్‌’ సూపర్‌ సక్సెస్‌తో టీం అందరం చాలా హ్యాపీగా ఉన్నాం: హీరో అభినవ్‌ సర్ధార్‌

ఎఎస్‌పి మీడియా హౌస్‌, జివి ఐడియాస్‌ పతాకాలపై అభినవ్‌ సర్ధార్‌, రామ్‌ కార్తిక్‌, చాందిని తమిళ్‌రాసన్‌, శాని సాల్మాన్‌, శెర్రి అగర్వాల్‌  నటీనటులుగా

‘సిగురాకు సిట్టడివి గడ్డ  చిచ్చుల్లో అట్టుడికి పోరాదు  బిడ్డా‘ భీమ్లా నాయక్' కోసం అడవి తల్లి గీతం

'భీమ్లా నాయక్' నుంచి మరో పాట విడుదల స్వర్గీయ సిరివెన్నెల సీతారామశాస్త్రి కు నివాళి