అఖండ సినిమా ఆడుతున్న థియేటర్‌లో మంటలు.. పరుగులు తీసిన ప్రేక్షకులు
Send us your feedback to audioarticles@vaarta.com
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. చాలా రోజుల తర్వాత బాలయ్య తెలుగు సినిమాకు సందడి తెచ్చారు. కరోనా భయంతో గడిచిన కొద్దినెలలుగా థియేటర్లు బోసిపోయిన సంగతి తెలిసిందే. అయితే మంచి మౌత్ టాక్‌తో ‘‘అఖండ’’ సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రదర్శిస్తోన్న థియేటర్ల దగ్గర అభిమానుల కేరింతలతో సందడిగా నిలిచింది.
అయితే శ్రీకాకుళంలోని రవిశంకర్ థియేటర్‌లో అపశృతి చోటు చేసుకుంది. తెరవెనుక ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయభ్రాంతులకు గురైన ప్రేక్షకులు బయటకు పరుగులు తీశారు. సౌండ్ సిస్టమ్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ మంటలు చెలరేగాయి. వెంటనే థియేటర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసురావడంతో ప్రేక్షకులు ఊపిరి పీల్చుకున్నారు.
మరోవైపు అఖండ సినిమా 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.35 కోట్లకు పైగా షేర్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. తెలుగు రాష్ట్రాల్లోనే 29.50 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది అఖండ. ఈ కలెక్షన్ల జాతర చూసిన తర్వాత అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. బాలయ్య బాక్సాఫీస్ స్టామినా తగ్గిపోయిందని కామెంట్ చేసిన వాళ్లకు అఖండ సినిమాతో దిమ్మ తిరిగిపోయే ఆన్సర్ ఇచ్చాడు నందమూరి అందగాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com