swapnalok complex : సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి

  • IndiaGlitz, [Friday,March 17 2023]

సికింద్రాబాద్‌లో మరో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. వీరిలో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు వున్నారు. వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్‌లో అత్యంత రద్దీగా వుండే ఏరియాలో వున్న స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో గురువారం సాయంత్రం మంటలు చెలరేగాయి. చూస్తుండగానే నాలుగు, ఐదు, ఆరు అంతస్తుల్లోకి మంటలు వ్యాపించాయి. ఈ ఫ్లోర్లలో అన్ని ప్రైవేట్ కార్యాలయాలే. దట్టమైన పొగలు వ్యాపించడంతో పైన వున్న వారు కిందకి రాలేకపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక, జీహెచ్ఎంసీ బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి.

గదిలో స్పృహ తప్పి పడిపోయిన ఉద్యోగులు:

మంటల తీవ్రత పెరగుతూ వుండటంతో చుట్టుపక్కల నివాస ప్రాంతాల్లో వున్న వారిని ఖాళీ చేచించారు అధికారులు. ఇదే సమయంలో పై అంతస్తులలో వున్న వారు సెల్ టార్చ్ లైట్ల ద్వారా తమను రక్షించాల్సిందిగా ఆర్తనాదాలు చేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది అతి కష్టం మీద లోపలికి వెళ్లి ఒక గదిలో స్పృహ తప్పి పడిపోయిన వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పొగ కారణంగా ఊపిరాడకే వీరు మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతులను ప్రమీల, వెన్నెల, త్రివేణి, శ్రావణి, శివ, ప్రశాంత్‌‌లుగా గుర్తించారు.

ఘటనాస్థలికి మహమూద్ అలీ, తలసాని :

అగ్ని ప్రమాదం విషయం తెలుసుకున్న మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు స్వప్నలోక్ కాంప్లెక్స్ వద్దకు వచ్చారు. అనంతరం అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ ఘటనలో గాయపడిన వారు అపోలో, యశోదా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అసలు ప్రమాదానికి దారి తీసిన కారణాలపై పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

More News

Custody:చావు ఎటు నుంచైనా రావొచ్చు .. కానీ నిజం నా కస్టడీలోనే : ఆసక్తికరంగా ‘‘కస్టడీ’’ టీజర్, మాస్ లుక్‌లో చైతూ

థాంక్యూ, లాల్ సింగ్ చద్దాలు నిరాశ పరచడంతో అక్కినేని వారసుడు నాగచైతన్యకు అర్జెంట్‌గా ఒక హిట్ పడాలి.

MLC Elections : నాలుగు స్థానిక సంస్థల కోటా స్థానాల్లో వైసీపీ ఘన విజయం.. !!

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 4 స్థానాల్లో అధికార పార్టీ ఘన విజయం సాధించింది.

AP Budget: 2 లక్షల  79  వేల కోట్లతో  ఏపీ  బడ్జెట్‌.. ఏ రంగానికి ఎంత కేటాయించారంటే..?

2023-24 ఆర్ధిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

Balakrishna:చిటికెస్తే చాలు..  బాలయ్య వార్నింగ్, నా ఏరియాలో నీకెం పనంటూ వైసీపీ ఎమ్మెల్యే కౌంటర్

టాలీవుడ్ అగ్రకథానాయకుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇటీవల వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నారు.

Panchathantram:‘పంచతంత్రం’ ... మార్చి 22న ఈటీవీలో స్ట్రీమింగ్

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యంగ్ హీరో రాహుల్ విజయ్, దివ్య శ్రీపాద,